సుప్రభాత కవిత : - బృంద
చిన్ని సంతోషాలు 
ఎన్నో పోగేసుకుంటూ 
కన్నులు మనసు నింపుకుంటూ 
నన్ను నేను ప్రేమిస్తూ....

కలుపులెన్ని మొలచినా 
ఏరిపారేస్తూ
మలుపులలో మార్పులను
సహనంతో సహిస్తూ..

కలలెన్నో కల్లలైనా
కలతపడక అడుగేస్తూ
ఆరాటపు ఆవిరిలో
పోరాటం సాగిస్తూ...

అతుకులతో బంధాలను
అలుపులేక భరిస్తూ
బ్రతుకులో మాయలన్నీ
నుదుటి రాతగా భావిస్తూ..

తలగడకు మాత్రం తెలిసిన
తపనలు సాధించే యత్నంలో
తలపులలో తృప్తిని నిలిపి
మనుగడలో దీప్తిని నింపి

ఉనికికోసం పోరాడుతూ 
ఊహలకు ఊపిరిపోస్తూ 
ఉన్నతంగా ఎదగాలని
ఉరికే మనసుల్లో వెలుగులు నింపే

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు