రాజాం రచయితల వేదిక సభ్యులు, పాలఖండ్యాం పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు, పెద్దిన ప్రతిభా పురస్కారం పొందారు.శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ ఆలయ కమిటీ, పెద్దిన మెడికల్ క్లినిక్, శ్రీ షిరిడి సాయి ఆటో మొబైల్స్ సంయుక్తంగా నిర్వహించిన మూడు రోజుల ఆద్యాత్మిక ప్రవచనాల ముగింపు సభలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పెద్దిన కులశేఖర ఆల్వార్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండల కేంద్రంలో గల సీతారామ ఆలయం ప్రాంగణంలో కార్తీక మాసపు ఆద్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శ్రీశ్రీశ్రీ ఆభయాంజనేయ ఆలయాన తిరుమలరావును పురస్కార ప్రదానం గావించి ఘనంగా సత్కరించారు. ప్రముఖ పండితులు, తెలుగు భాషా ఉపాధ్యాయులు ముదిల శంకరరావుచే మూడు రోజుల పాటు మహా భాగవతంలో భక్తప్రహ్లాద చరిత్రను ఆయన భక్తజనులకు వినిపించగా, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమలరావు ఆహ్వానించబడ్డారు. ఈనాటి వేదికపై తిరుమలరావు భక్తిగీతాలను ఆలపించి అందరి ప్రశంసలు పొందారు. సభాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్ మాట్లాడుతూ ఎనిమిది నెలల క్రితం కొత్తూరులో కొత్తూరు రచయితల వేదికను స్థాపించిన కుదమ తిరుమలరావును, ఈ ఏడాది పెద్దిన ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసామని అన్నారు. రచయిత, చిత్రకారులు, గాయకులు, నటులు, సమాజ సేవకులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత తిరుమలరావును, పెద్దిన ప్రతిభా పురస్కారంగా శాలువా, ప్రత్యేక కానుకలు, నగదు పారితోషికాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు, కొత్తూరు రచయితల వేదిక గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్, ఆలయ ధర్మకర్త పెద్దిన విశ్వనాథం, డా.పి.ప్రసన్నకుమార్, పి.యశస్వి, కొత్తూరు రచయితల వేదిక ఉపాధ్యక్షులు ఎం.శంకరరావు, కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు, కార్యవర్గ సభ్యులు అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్, పి.రామచంద్రరావు, ఉపాధ్యాయులు లంకవలస రమణయ్య, శ్రీదేవి, లీలారాణి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార కార్యకర్త పొగిర రవి, కాంట్రాక్టర్ పి.అర్జున్, భక్తబృంద సభ్యులు అల్లు రాములు, వైశ్యరాజు నారాయణరావు, కుప్పిలి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి