సాహితీ కెరటాలు
సాహితీ కవి కళా పీఠం
==============
వరదలెన్ని వచ్చినా,
తుఫాను నిన్ను ముంచినా,
విడువవు ఎపుడూ నీ ధైర్యం
పరుల కడుపు నింపే భాగ్యం. ..
అదియే నీ ఆత్మ విశ్వాసం ఓ కర్షకా ....!
ఆలు బిడ్డల , తల్లి దండ్రుల ఎడబాసినా,
మంచు దుప్పటి నిన్ను కప్పేసినా,
చలికి నీవు వణుకుతున్నా,
పరదేశాలు నిన్ను భయ పెట్టినా,
దేశ రక్షణ నీదు ధ్యేయమైనది...
అది యే నీ ఆత్మ విశ్వాసం ఓ సైనికా ..!
పరీక్షలెన్ని ఎదురైనా,
ఫలితమెట్లా వచ్చినా,
ఎంచుకున్న నీ లక్ష్యమే నీ కంటి ముందర ఉంచుకో...
కన్న వారి కలలు తీర్చగ,
నిరాశనే దరిచేరనీయక,
నీ ఆశయం సాధించగా,
కన్న వారి కలలు తీర్చగ
సాగిపో ముందుకు....
అదియే నీ ఆత్మ విశ్వాసం ఓ యువకుడా ...!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి