నా పేరు ప్రణయ్ కుమార్, నేను 6 తరగతి చదువుచున్నాను. నేను పొద్దున్నే లేచి తయారై 8.30 గం స్కూల్ కి పోయాను, 9.05 ప్రార్థన చేశాము, 1 పిరియడ్ కు మా క్లాస్ రూమ్ కి వచ్చాము. మా క్లాస్ టీచర్ ఉమాదేవి వచ్చి హాజరు తీసుకున్నది. నెహ్రు గారి గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఆ తర్వాత రెండో పెళ్లి అయింది. తెలుగు గురువు గారు మా క్లాసుకి వచ్చారు. మాకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు . ఆ తర్వాత ఉడుత సాయం పాఠము చదివించారు మమ్ములను. ఆ తర్వాత కూడా మూడు నాలుగు పీరియడ్ల లో పాఠాలు జరిగినాయి. ఆ తర్వాత మధ్యాహ్నం అన్నం బెల్ అయింది. అన్నం తినడానికి సిద్ధపడ్డాం . అయితే ఈరోజు మా బడిలో ధనలక్ష్మి టీచర్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం పిల్లలకు పులిహార పెట్టించారు.అదే విధంగా బడిలో పప్పు వండారు. మధ్యాహ్నం మొదటి గంట అయింది తరగతిలోకి పి ఈ టి సర్ వచ్చారు. ఆ తర్వాత రెండో బెల్, తర్వాత మమ్మల్ని అందరినీ బయటకు పిలిచారు, పిల్లలందరం బయటకు వచ్చాము. సార్లు సౌండ్ బాక్సులలో పాటలు పెట్టారు. నెహ్రూ గారికి టీచర్లందరూ పూలమాల వేసి సత్కారం చేశారు. పాఠశాల లోని ఇంగ్లీష్ టీచర్ సరిత నెహ్రూ గారి గురించి ఒక పాట పాడింది. చాలా బాగున్నది. ఇక ఆటలు మొదలైనవి, మా క్లాస్ టీచర్ గ్లాసు బుంగ ఆట ఆడిపించారు, ఫస్ట్ రౌండ్లో నేను గెలిచాను, కానీ సెకండ్ రౌండ్లో గెలవలేదు, మా క్లాస్ అబ్బాయి సమీక్ష్ గెలిచాడు, అతనికి మొదటి బహుమతి వచ్చింది. టెన్త్ క్లాస్ వాళ్ళు డ్రెస్ గేమ్ ఆడారు, చాలా బాగుంది నేను చాలా సంతోషించాను, అయితె 8 క్లాస్ వాళ్లు కూడా స్ట్రాతో పేపర్ గిన్నెలో వేసే ఆట ఆడారు. అందులో సంతోష్ అన్న గెలిచాడు, మరో గ్రూపులో కిషోర్ అన్న గెలిచాడు. తొమ్మిదో తరగతి పిల్లలు కూడా డైస్ గేమ్ ఆడారు , ఏడవ తరగతి వాళ్ళు బెలూన్ గ్లాస్ గేమ్ ఆటాడారు చాలా బాగుంది. తర్వాత అందర్నీ గుండ్రంగా కూర్చోబెట్టి మా ఉపాధ్యాయులందరూ మాకు సమోసాలు తెచ్చి పంచిపెట్టారు. ఆ సమయంలోనే మా తరగతి విద్యార్థి నితిన్ డాన్స్ వేశాడు. పదో తరగతి అక్క లు కూడా పాటలకు డాన్స్ వేశారు. సెవెంత్ క్లాస్ అన్నయ్యలు కూడా మిక్సిసింగ్ డాన్స్ కి చాలా మంచి డాన్స్ చేశారు. ( సోను, అన్వర్ ). ఈరోజు మా పాఠశాల హెచ్ఎం గారు సెలవు పెట్టారు రాలేదు. చివరగా ఒక పాట పెట్టారు మా పిల్లలందరం కూడా డాన్స్ వేశారు, ఆ తర్వాత అందరం చేతులు కడుక్కున్నాము. తర్వాత బెల్ కాగానే ఇంటికి వెళ్ళాము. ఈరోజు మా పాఠశాలలో బాలల దినోత్సవం చాలా ఆనందంగా జరుపుకున్నాం. నాకు చాలా సంతోషం అనిపించింది.
బాలల దినోత్సవం : - తోటకూరి ప్రణయ్ కుమార్, ఆరవ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల,,నల్గొండ జిల్లా.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి