అందెశ్రీ :- వరలక్ష్మి యనమండ్ర -హైదరాబాద్
వరంగల్లులో జననం 
అక్షర జ్ఞానము శూన్యం 
విజ్ఞానమేమొ అపారం 
జయ జయహే అందెశ్రీ !

అడ్డులేనిది ఆ కలం 
అద్భుతమైనదా గళం 
కొనసాగించె ఉద్యమం
జయ జయహే అందెశ్రీ!

తన ఇంటిపేరు అందె 
తను పాడుపాట చిందే 
అందరికీ అది విందే 
అందె ఎల్లయ్య జయహో!

రుగ్మతలకది మందే 
ఉద్యమములన పొందే (పొత్తు)
శత్రు మనసులు కందే
అందె ఎల్లయ్య జయహో!

గ్రామాలలో అనునిత్యం
తెచ్చెనతడు చైతన్యం
అద్భుతమే తన గానం 
తెలంగాణకది తేజం 

పాటల తోట పెంచెను
మాతృగీతం రచించెను 
అమృతము చిందించెను
అమరత్వము పొందెను 

మానవత్వం ముఖ్యమని 
మహిని ఏదీ లేదని 
చాటిచెప్పిన కవిని 
కాంచలేము ఈ భువిని !

అభ్యుదయ గీతాలతో 
అచంచలపు స్పూర్తితో 
నిరంతరం ఓరిమితో 
ముందుకు సాగెను అందె!

పల్లెలలో జనవాణి 
ప్రత్యేకము తన బాణి 
స్పూర్తివంతపు ధోరణి 
మురిసినదీ ధరణి!

జ్ఞానపీఠ పురస్కారం 
కోటిరూకల్బహుమానం 
ఇంతకంటె ఏ గౌరవం 
ఉంటుందీ ఈ జగతిన?

లోక కవీ! ఓ ఎల్లయ్య !
నీవులేక మేమెట్లయ్య !
మరల నీవు రావయ్య !
మా మంచి అందె ఎల్లయ్య!

ఉదయించే సూర్యునివి!
వెన్నెలిచ్చు చంద్రునివి!
మెరిసేటి తారకవి!
మా అందరి ఊపిరివి!


కామెంట్‌లు