సంపూర్ణ మహాభారతము- సరళ వ్యావహారిక భాషలో...!
 

ఆది పర్వము సప్తమాశ్వాసము- 38వ రోజు
అర్జున అంగారుపర్ణుల స్నేహము
అంగారపర్ణుడు " అర్జునా నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నీకు చాక్షుసీ విద్యను, మహా వేగం కలిగిన గుర్రాలను ఇస్తాను నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం నాకు ఇవ్వు " అన్నాడు. అర్జునుడు " గంధర్వా మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని స్వీకరించరాదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ వద్ద గుర్రాలను స్వీకరిస్తాను " అన్నాడు. అర్జునుడు గంధర్వునితో " ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు " అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు " అర్జునా ! ఆడవారితో ఉన్న వాడు వివేకం కోల్పోవడం సహజం కానీ ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మా ధర్మ విచక్షణ చేస్తాడు. తాపత్యా ! మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకొండి " అని చెప్పాడు. అర్జునుడు " మిత్రమా ! మేము కుంతీ పుత్రులమైన మేము తాపశ్యులము ఎలా అయ్యాము " అని అంగారపర్ణుని అడిగాడు. అంగారపర్ణుడు ఇలా చెప్పాడు " అర్జునా ! సూర్యుని కూతురుకు సావిత్రికి చెల్లెలు తపతి అనే కన్య మహా సౌందర్యవతి. ఆజాఘీడుని కొడుకు సంవర్ణుడు. అతడు సూర్యుని గురించి తపసు చేసాడు. తన కూతురు తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు. ఒక రోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు. ఆమె మౌనంగా అక్కడ నుండి వెళ్ళినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది. పిచ్చి వాడిలా తిరుగుతున్న సంవర్ణునిని చూసి అతని బాధను అర్ధం చేసుకుని తాను కన్యనని స్వతంత్రురాలిని కాదు కనుక తండ్రి అనుమతితో వివాహమాడమని చెప్పింది. ఒక రోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు. వశిష్టూడు సూర్యుని వద్దకు వెళ్ళి " పూరు వంశస్థుడు, ధర్మపరుడు, సత్గుణ సంపన్నుడైన సంవర్ణునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు. సూర్యుడు తన కోరిక తీరు తున్నందుకు సంతోషించి తపతిని వశిష్టునితో పంపాడు. వశిష్ఠుడు వారిద్దరికి వివాహం చేసాడు. వారికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురు వంశజులు కనుక మిమ్మల్ని తపత్యా అని పిలిచాను " అని చెప్పాడు.
వశిష్ఠుడు
అర్జునుడు అంగారపర్ణుని చూసి " గంధర్వా ! మా పూర్వులకు గురువు పురోహితుడైన వశిష్టుడిని గురించి వినాలని ఉంది " అడిగాడు. అంగార పర్ణుడు అర్జునితో ఇలా చెప్ప సాగాడు. "అర్జునా ! పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనేరాజు పాలిస్తున్నాడు. ఒక రోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్ళి అలసి పోయి వశిష్టుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు. ఇరువురు పరస్పర కుశలం విచారించుకున్న తరువాత వశిష్టుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చేయడానికి అంగీకరించాడు. నందినీ అనే కామధేనువు సాయంతో అపార సేనావాహినితో సహా విశ్వా మిత్రునకు వశిష్ఠుడు షడ్రశోపేత మైన విందు భోజనం పెట్టాడు. అది విశ్వామిత్రుని ఆశ్చర్యచకితుని చేసింది. అలాంటి ధేనువు తన వద్ద
ఉండటం ఉచిత మని ఎంచి వశిష్టుని వద్దకు వెళ్ళి ఆ ధేనువును ఇమ్మని కోరాడు. వశిష్ఠుడు అది తనకు ప్రాణాధారం కనుక ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కనుక తాను తీసుకు వెళతానని బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళాడు. తిరిగి వశిష్టుడిని చేరిన నందినీ తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడింది. విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి క్షాత్ర బలం కటే తపో బలం గొప్పదని తెలుసుకుని రాజ్యాన్ని విడిచి పెట్టి తపసు చేసుకోవడానికి వెళ్ళాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు