ఆది పర్వము సప్తమాశ్వాసము: - 40 వ రోజు
ఔర్యుడు
అతడి తాత వశిష్ఠుడు " పరాశరా ! అకారణంగా అందరిని హరించడం తగదు. పూర్వం కృతవీర్యుడు భృగువంశ వంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను చేసాడు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. కొంత కాలానికి కొంత మంది క్షత్రియులు భృగు బ్రాహ్మణులు కృతవీర్యుడి ధనాన్ని దాచుకున్నారు అని అపప్రధ పుట్టించారు. అది విని కొంత మంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు. కొంత మంది ధనాన్ని భూమిలో పాతి పెట్టారు. క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్ని తీసుకు వెళ్ళారు. భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చంపి వేసారు. స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు. అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తోడలో గర్భాన్ని దాచింది. ఆమె తొడ నుండి తేజో వంతుడైన ఔర్యుడు అనే కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరూ అంధులయ్యారు. ఔర్యుడు త తండ్రితో సహా బంధులందరిని చనిపోయారని తెలుసుకున్నాడు. లోకాలను నాశనం చేయటానికి ఘోర తపస్సు చేయడం సంకల్పించాడు. ఔర్యుని పితృదేవతలు ప్రత్యక్షమై " మేము అసమర్ధులమై క్షత్రియుల చేతిలో మరణించ లేదు. ధనాపేక్షతో ధనాన్ని దాచలేదు. మేము గొప్పగా తపస్సు చేయడం వలన మాకు మరణం రాలేదు. ఆత్మ హత్య చేసుకుందామని అనుకుంటే అది పాపమని చేయలేక పోయాము. ఈ మనుష్య లోకంలో అధిక కాలం ఉండలేము. కనుక క్షత్రియులతో వైరం తెచ్చుకుని వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము. కనుక నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు " అని పలికారు. వారి మాటలను విన్న తరువాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు.*
పరాశరుని సత్రయాగం
ఔర్యుని వృత్తాంతం విని పరాశరుడు సంకల్పం విరమించుకున్నా రాక్షసుల మీద కోపం పోలేదు. అందు వలన పరాశరుడు రాక్షస వినాశనానికి సత్రయాగం చేయ సంకల్పించాడు. వశిష్ఠుడు అందుకు అభ్యంతరం చెప్పలేదు. ఆ సత్రయాగంలో రాక్షసులందరూ పడి భస్మం అవుతున్నారు. అలా రాక్షస జాతి అంతరిస్తుంటే పులస్త్యుడు, పులహుడు, క్రతువు వశిష్టుని దగ్గరకు వచ్చి పరాశరుడు చేసే రాక్షస వినాశనం ఆపమని వేడుకున్నారు. వారి కోరికను మన్నించి పరాశరుడు సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపి వేసాడు.
ధౌమ్యుడు
అర్జునుడు అంగారపర్ణునితో " మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు. మాకు నువ్వు దారి చూపి పురోహితుడిని ఎవరో చెప్పు " అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు " ఇక్కడకు ఉత్కంచం అనే పుణ్య తీర్థం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపసు చేసుకుంటున్నాడు. మీరు అతనిని పురోహితునిగా చేసుకోండి " అని అర్జునినితో అన్నాడు. తరువాత పాండవులు ధౌమ్యుని వద్దకు వెళ్ళారు. అతనిని తమ పురోహితునిగా ఉండమని కోరారు. ధౌమ్యుడు అందుకు సమ్మతించాడు. పాండవులు కుంతీ దేవి ధౌమ్యుని వద్ద ఆశీర్వాదం తీసుకుని ఆయనతో పాంచాల దేశానికి బయలు దేరారు. దారిలో మరి కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించారు. పాంచాల దేశంలో వారు ఒక కుమ్మరి ఇంట బస చేసారు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి