****
"అవ్వా! అవ్వా! గియ్యాల మా బల్లె ఏమైందో ఎరికేనా? ఇంగో! మూడో తర్తి పోరడు లింగా గాడు గిన్నాళకి పట్టుబడ్డడు."
"పట్టుబడుడేందే భూలచ్మీ! గాడేమన్న దొంగతనం,అల్లరి పని జేసిండా?"
"అవునవ్వా! మా పిలగాండ్లకి సార్లిచ్చిన కొత్త వయ్యిలు,రాత బుక్కులు,పెన్సీలు,పెన్నులు గాని సంచిల దొర్కినయ్. నా పెన్ను ,పెన్సిలు పొయినయంటె తిడ్తవని చాన్రోజుల సంధి నీకు సుత జెప్పలే".
" సరె గని గాని సంచిల గియన్ని ఉంటయని మీరెట్ల పసిగట్టిండ్రే బంగారూ?"
"మాకు సుత తెల్వదవ్వా! గియ్యాల వాని అమ్మ వొచ్చి చెప్పింది.దినాం ఇంటికాడికి రకరకాలవి తీస్కపోయి దోస్తులు ఇచ్చిండ్రని సెబుతుంటే వాళ్ళ నాయిన అమ్మ నిజవే అన్కొన్నరంట. గింత మందివి గట్లెట్ల బోతయని మా తెలుగు సారు అందరిమీద కన్నేసి ఉంచిండంట.గీడే అని తెల్సినంక వాడి కొత్త వయ్యిలు దీసి దాసిండంట. వయ్యిలేమైనయని గియ్యాల వాళ్ళమ్మ బల్లెకొచ్చింది".
" గామె రాంగనే పెద్ద పెద్దగ గాయికెత్తుకునే తల్కి సార్లంత ఒక్క తాన గూడిండ్రు. తెలుగు సారు అసలు సంగతి జెప్పేతల్కి గీడు గింత లేడు గిన్నె అబద్ధాలడ్తడా? దోత్తులిచ్చిండ్రని జెప్తడాని గుంజుకొచ్చి పెడా పెడా గొడ్తుంటే, తెలుగు సారు ఆపి ఆమెనే కోప్పడ్డడు.
ఎందుకంటే గాడు దినాం తెచ్చినప్పుడు నిలదీయొద్దా! దోస్తులైతే మాత్తరం దినాం ఇస్తరా ఏంది? అన్నడు.
గందుకే అంటరు "అమ్మ పెట్టే నాలుగు గానాడె పెడితే -గింతకాడికెందుకొస్తది."మొదగాల దెచ్చిన్నాడే గీ నాల్గు పెడితే గింత కాడికి రాదుగ? ఎందుకొస్తది. గాయమ్మకి కూసింతైన బుద్ధుండాలి. సారు కోప్పడ్డడంటే ఎందుకు కోప్పడడు.
"అంటేందవ్వా? నాకేమి సమజైతలే".
"గీ కత ఇను నీకే సమైజతది" అనంగనే బుడ్డోడు కత అన్న మాటిని రయ్యిన ఉరికొచ్చి భూలచ్మి పక్కన కూసుండు.
అనగనగా ఓ అమ్మ.గామెకి మన బుడ్డోడంత కొడ్కుండు. గాడు ఓ దినం పక్కింటోళ్ళు ఇంటెనకాల పెంచుకుంటున్న తోటకూర కోసుకొచ్చి అమ్మకి ఇచ్చిండు. "ఎక్కన్నించి దెచ్చినవ్? ఎవులనడిగి తెచ్చినవ్? అని అడక్కుండా సంబురంగ గా కూర కమ్మగ వండి కొడుక్కింత బెట్టి,తనింత తింది.
గట్ల అమ్మ ఏమంటల్లేదని ఏవేవో దొంగతనం జేసుకొచ్చుడు.అమ్మకి ఇచ్చుడు. గట్ల వాడు పెద్దగయితున్నాకొద్దీ పెద్ద గజదొంగ అయ్యిండు.
ఓ దినం రేతిరి రాజుగారింట్లోనే దొంగతనానికి బోయిండు.అక్కడ కాపలా కాత్తున్న బటులు జూసి పట్కున్నరు.పొద్దుగాల గీ యిసయం దెల్సుకున్న రాజు గాడికి ఉరిచిచ్చ ఏసి,ఆకరి మాట ఏమైన జెప్పాలన్కుంటె జెప్పమని అన్నడు.
గప్పుడు ఆ దొంగ మాయమ్మని బిలిపిచ్చమని ఏడుకుండు.తల్లొచ్చి కొడుక్కి ఉరిచిచ్చ బడ్డదని తెల్సి ఒక్క తీర్గ ఏడ్వబట్టింది.
గది జూసి దొంగ "అమ్మా! "నువ్వు పెట్టేవి గానాడే పెడితే -గింతకాడికెందుకొస్తది? గిదంత నీవల్లనే. తోటకూర తెచ్చిన్నాడు నాలుగు తగిలిస్తే గట్ల తేవడం తప్పని తెల్సేదిగా!" అన్నడు.
గందుకే మరి శిన్నప్పుడు పొల్లగాండ్లు తెల్సి తెల్వక తప్పుజేస్తే ఎంబటే సరిదిద్దాలె. గప్పుడు సుత ఇనకపోతె నాలుగు సప్పరిచ్చాలి.గట్ల చేయకపోతే మీ బల్లె లింగా పోరడి లెక్క అయితరు. పెద్దయినంక కతల చెప్పినట్టు అయినా ఆచ్చెర్రం లేదు.చివరాకరికి గా దొంగ బత్కు ఏమైంది?ఉరిచిచ్చ పడేకాడికొచ్చింది?
" అవుమల్ల !గసుంటి చెడ్డ పనులు అస్సలు చెయ్యొద్దు.అబద్దాలు చెప్పొద్దు.అడక్కుండ ఎవ్వలివి తీస్కోగూడదు గదవ్వా!"
అంటున్న భూలచ్మి, బుడ్డోడిని జూస్కుంట "ఎరీ గుడ్డు. గిట్లనే ఎప్పుడుండాలి" వీపు నిమిరి పొద్దుగాల జేసిన కొబ్బరుండ చెరొకటిచ్చింది.
గదండీ సంగతి! "అమ్మ పెట్టే నాలుగు గానాడే పెడితే -గింతకాడికెందుకొస్తది." సామెత అర్థం గిదే మరి.మంచి చెడు పిల్లలకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత పెద్దలదే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి