సుప్రభాత కవిత : - బృంద
తొంగి చూసి నవ్వే 
నింగి వేలుపు చూపు 
నిలిచి నివ్వెరపోవు
నీటి పైనా?

నీటి తాకిడి లేక 
బయట పడి కొత్తగా
తేరిపార చూచు
రాతి బండ గుళ్లపైనా?

కొండ కోనల వెలసి
బండబారి  నిలిచిన 
కనుమదారుల కనపడు 
కఠిన శిలలపైనా?

బట్టబయలున ఒంటరిగా
చుట్టుముట్టిన చీకటికి 
బెదరక  నవ్వుతూ నిలిచిన 
చెట్టుచేమల పైనా?

నీది నాదను వాదమే లేక 
ఏది ఎవరి సొంతం కాదని 
రాదు ఏదీ తమ వెంట అనీ 
తెలిసిన హృదయాలపైనా?

సాగి పోవు కాలము తాను 
ఆగిపోదు ఎవరికోసము 
ఎంత కష్టమైన ఎంత ఇష్టమైనా 
నిలవదేదీ కదలక అని సూచనా?

అందరికాధారం  అయిన
అంతర్యామి తాను
ఆణువణువూ పరికించి
అడుగడుగున తోడుంటాననే  ఆసరానా?

కొత్తరోజుకు కొండకోనల స్వాగతమా?

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు