నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్నను 'బాలబంధు శ్రీ సమతారావు' అవార్డు వరించింది.శాఖా గ్రంథాలయం,అలపాటి కళావతి రవీంద్ర పీఠం మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ తెనాలి వారు బాలసాహిత్యంలో కవి సోమన్న విశేష కృషికి గాను ఈ అవార్డును గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో, తెనాలిలో అందజేశారు.అనంతరం సోమన్న విరచిత "పాలపిట్ట" పుస్తకం ఈ సంస్థ అధ్యక్షులు సహజ కవి డా.అయినాల మల్లేశ్వరరావు మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా అవిష్కరించి,కృతికర్తను సత్కరించారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.
'బాలబంధు శ్రీ సమతారావు' అవార్డు గద్వాల సోమన్నకు ప్రదానం
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్నను 'బాలబంధు శ్రీ సమతారావు' అవార్డు వరించింది.శాఖా గ్రంథాలయం,అలపాటి కళావతి రవీంద్ర పీఠం మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ తెనాలి వారు బాలసాహిత్యంలో కవి సోమన్న విశేష కృషికి గాను ఈ అవార్డును గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో, తెనాలిలో అందజేశారు.అనంతరం సోమన్న విరచిత "పాలపిట్ట" పుస్తకం ఈ సంస్థ అధ్యక్షులు సహజ కవి డా.అయినాల మల్లేశ్వరరావు మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా అవిష్కరించి,కృతికర్తను సత్కరించారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి