బక్రిచెప్యాల విద్యార్ధులకు అంతర్జాతీయ గుర్తింపు
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా నవంబర్ 30,2025 ఆదివారం అంతర్జాలంలో 13గంటల పాటు బాలసాహిత్య భేరి పేరుతో  "అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం" నిర్వహిస్తుంది.
ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనటానికి తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేటజిల్లా, బక్రిచెప్యాల పాఠశాల విద్యార్థినిలు
1.నరాల భార్గవి 9వ,తరగతి 
2.కొత్త చాకలి అమూల్య 8వ, తరగతి
3.భౌగోళ్ల శ్రీపూజ 7వ,తరగతి 
4.బట్టల సాన్వి 6వ, తరగతి
  బాలగేయాలు విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థిని విద్యార్థులు 101మంది కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ 4 గురు చిన్నారులు గేయం విభాగంలో ఎంపికయ్యారని, 3నిమిషాల పాటు గేయం వినిపిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు 
శ్రీ దారం నాగేందర్ రెడ్డిగారు,
పూర్ణచందర్ రావు,
సుహాసిని,శ్రీశైలం,రమాదే

వి,
వరుకోలు లక్ష్మయ్య,శ్రీనువాస్, యాదమ్మ , ఆంజనేయులు,సరిత, భూలక్ష్మి ఉపాధ్యాయ బృందం తమ హర్షాన్ని  తెలియజేశారు.
విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు,కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు,ప్రఖ్యాత బాల సాహితీవేత్తలు,జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్న కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థినులకు అరుదైన అవకాశం కల్పించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి, సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ  శ్రీనివాస్ గారికి
పిల్లలను బాలసాహిత్య రంగంనందు ముందంజలో రాణింపజేస్తున్న వరుకోలు లక్ష్మయ్య గారు తెలుగు భాషోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
కామెంట్‌లు