సర్పాల ఉత్పత్తి :- అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం పాములంటే భయపడతాం కానీ నాగ పంచమి నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తాం పాములు పర్యావరణ రక్షకులు అసలు ఈ పాముల ఉత్పత్తి ఎలా అయింది మహర్షి మహాసభ రాజైన ప్రజాపాలుడికి ఈ పాముల గురించి చెప్పాడు మరీచి బ్రహ్మ కొడుకు అతని కొడుకు కశ్యపుడు దక్ష ప్రజాపతి ఒక కూతురు కటు. ఆమె కశ్యపుని పెళ్లాడింది వీరికి ఎంతోమంది పుత్రులు పుట్టారు వారిలో అనంతుడు వాసుకి మహాబలి కంబలుడు కర్కోటకుడు పద్మ మహా పద్మ శంఖ కులుకు అనేవారు ముఖ్యమైన బలవంతులైన సర్పాలు ప్రపంచమంతా ఈ పాములతో నిండిపోయింది అప్పుడు దుష్ట బుద్ధితో ఇవి చెడ్డ పనులు చేస్తూ నోటి నుంచి విషాన్ని కక్కసాగాయి మనిషిని అనవసరంగా కాటు వేసి చంపుతున్నాయి ఇలా జనాలు చనిపోవడం చూసి ప్రజల ప్రతినిధి అయిన ప్రజాపాలుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి స్వామి ఈ పాముల నుంచి మనుషుల్ని కాపాడు మనిషి పశువులు కూడా చనిపోతున్నాయి అప్పుడు బ్రహ్మ అతని ఓదారుస్తూ ప్రజాపాల నీవు భయపడకు మీరంతా ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళండి ప్రజలంతా ధైర్యంగా ఉండండి బ్రహ్మ కి ఈ పాముల దుష్టల వల్ల చాలా కోపం వచ్చింది ముఖ్యమైన పాములను పిలిచి ఇలా శపించాడు ఒరేయ్ నాగులు నేను సృష్టించిన మనుషుల్ని మీరు కాటు వేస్తున్నారు ఆఖరికి మీ అమ్మ శాపంతో మీరే చూస్తారు అప్పుడు పాములన్ని భయపడిపోయి ఆయన కాళ్లపై పడ్డాయి ప్రభు మీరే కదా మా కుట్టిన జాతిని పుట్టించారు మా స్వభావం కి కూడా మీరే కదా కారకులు మరి మమ్మల్ని ఏం చేయమంటారు మాకు వేర్వేరు ప్రాంతాలు ఇవ్వండి అక్కడ మేము నివసిస్తా బ్రహ్మ ఇలా అన్నాడు మీరు మనుషులతో ఉండాలి పాతాళంలో నివసించండి కొన్ని రోజుల తర్వాత మీరు కశ్యపుడి వల్లే పుత్రులుగా పుడతారు గరుత్మంతుడు మీకు సోదరుడైతాడు జనమేజయుడి యాగంలో మీ సర్పాలన్నీ పడి స్వాహా అవుతారు దుష్ట సర్పాలని ఆ యజ్ఞంలో మండి భస్మం అవుతాయి మనుష్యుడు మీకు అపకారం చేస్తే అతన్ని కాటేస్తే స్వతంత్రం మీకు ఉంది గరుడ మంత్రం పాము విషానికి విరుగుడు తెల్చిన ఓషధులు గుర్తించగలిగిన మనుషులతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మ ఇచ్చిన ఈ వరంతో పాములన్నీ పాతాళ లోకానికి వెళ్లి నివసిస్తున్నాయి అందుకే చలికాలంలో పాములు బయటికి రావు అవి ముడుచుకుని నిద్రలో పడతాయి మట్టి యొక్క వేడి వలన అవి వెచ్చగా నిద్ర వస్తలో ఉంటాయి. ఇలాంటి శాపం పంచమి తిధిలో జరిగింది కాబట్టి జనాలు పాము పుట్టలో పాలు పోస్తారు అలా వారు మిత్రులవుతారు ఈ పాలవలన పాము విషం కొంత శాంతిస్తుంది ఆ విషయంలో ఉన్న వేడి తగ్గుతుంది పాము కాటు వేసిన వ్యక్తి ముందు పాలు ఉన్న పాత్రను పెడతారు పాము కాటు పడిన ప్రాంతంలో తాడుతో గట్టిగా కట్టి దాన్ని పాలు తోటి తుడుస్తారు విషయానికి విరుగుడుగా సూది మంది ఇస్తారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి వాసుకి సర్వమే ఈ భూమండలాన్ని మోస్తుంది విష్ణుమూర్తి నాగశయనుడు. ఈకథలవల్ల మనకు తెలిసేది ఏమంటే పాముల్ని అనవసరంగా సంపరాదు వాటి జోలికి వెళ్ళరాదు అలా మన పెద్దలు పర్యావరణ రక్షణ కోసం సర్పాలతో సహా అన్ని ప్రాణుల్ని కాపాడాలని కథల రూపంలో చెప్పారు కాకపోతే పాము కాటు వేసిందని మంత్రాలుతో పోదు వెంటనే డాక్టర్ కి చూపించు కోవాలి లేకుంటే విషం శరీరమంతా ఎగబాకి మనిషి చనిపోతాడు🌹
కామెంట్‌లు