న్యాయాన్యాయం!:- అచ్యుతుని రాజ్యశ్రీ
సంవిధాన్ దివస్ ఇరవై ఆరు నవంబర్ రాజ్యాంగసభ ఆమోదం
పందొమ్మిదివందల నలభై తొమ్మిదిలో 
ప్రాథమిక హక్కులు,న్యాయాన్ని కాపాడాలని లిఖితం
న్యాయానికి కళ్లేవీ? న్యాయాన్యాయం మాయామయం జగములు 

చట్టాలు కొందరికి చుట్టాలుగా 
పుట్టలో పాములా కస్సుబుస్సు
ఎక్కడుంది సమానత్వం మానవత్వం?
ఆర్థికంగా చితికిన మేధావులు త్రిశంకుస్వర్గంలో 

కులాల కుచ్చు,మతాల ఉచ్చు పెరుగుతూ 
కోర్టుల్లో పెండింగ్ కేసులు వేవేలు 
దర్జాగా కాలరెగరేసే తరతరాల రౌడీయిజం పశుత్వం

కాలానికి తగినట్లు విద్య వైద్య  ఉద్యోగంలో ప్రతిభకు ఏదీ చోటు!?
ఖర్చుపెట్టి చదువులు,పదవులు,ఉద్యోగాలు
బ్రెయిన్ డ్రెయిన్ భారతంలో
యువత నిరాశ నిట్టూర్పులు

పిల్లిమెడలో గంటకట్టే శక్తి లేని సామాన్యుడు
అనైక్యత ఆధిక్యత పదవులపోరుతో విలవిల 
ఉన్నోడి కాసుల గలగల 

న్యాయ స్థానాల నత్తనడక
చట్ట సభల్లో జుట్టుపట్టుకునే తత్వం
పోలీసు మిలటరీ సరిగ్గా ఉంటేనే దేశరక్షణ,
పన్నులు ఎగవేసే బడా చోరులు 
జేబుదొంగ పట్టుబడితే గభీగుభీ

అంగాంగాలు ఏకీలుకాకీలు ఊడుతున్న దశ
నీతిమంతులు గద్దెపై ఉంటేనే మరల్చగలరు దేశం దిశ
అందుకే నాకలం దైవంపై భరోసాతో ఆశగా ఎదురుచూపులు
మేరాభారత్ మహాన్ అంటూ కేకలు
...స్వస్తి...

కామెంట్‌లు