వీడని కలతల నీడే అయినా
వాడని నవ్వులు తోడుగా
మోడుగా మారిన వేళలోనూ
ఓడక నిలిచేదే ధైర్యం!
కలిగే మార్పులు సహజమని
జరిగే కాలాన్ని అనుసరిస్తూ
తొలగే బంధాలు వదిలేస్తూ
మెలగే తెలివే లౌక్యం!
మదిలో మమతలు మాయవని
దాచిన ప్రేమను ప్రకటించే
వేచిన సమయం వచ్చునని
ఊహకు పేరే నమ్మకం!
అదుపులేని ఆశలు
అలవికాని పనులు
అందుకోలేని ఫలితాలను
అణచి వేసేదే నేర్పు!
చిగురులు వేసే తరుణం కోసం
దిగులును మరచి వేచి
తిరిగి పచ్చగా ఎదగాలని
చెదరక నిలిచేదే సహనం!
గడిచే క్షణం మరలి రాదని
పిలిచే పిలుపులు వినపడవని
వగచే వేదన వద్దని
తలచే వారిని కలిసేదే బంధం!
అనుదినమొక అనుభవం
ప్రతిక్షణమొక పరీక్ష
జీవన పుస్తకపు మరో పుటకు
స్వాగతం చెప్పేదే జీవితం!
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి