అక్షరమే ఆయుధం...
కలమే ఖడ్గం....
అన్యాయాల నెదిరిస్తాయ్
అధర్మంపై అక్షర శరవర్షం కురిపించాలి....!
ఈ ఘన కార్యాలన్నీ అక్షరము , కలము చేస్తు న్నాయా....!?
యే కార్యాని కైనా....
కర్త అనేవాడొక డు0డాలిగా...!
కర్మ చేత క్రియను జరిపిం చాలి.....!
అప్పుడు....పూర్ణముగా
ఒక ఫల మనేది వస్తుంది!
ఇక్కడ అక్షరం గానీ , కలం గాని... వాటికవిగా యేమీ చేయ లేవుగా....
ఇవి కేవలం కర్మలు మాత్రమే....!
క్రియ జరిపించే వాడొకడు న్నాడు....!
వాడే సమాజ స్థితి, గతులకు స్పందించే వాడు !
ఆవేదన తోనో...
ఆనందము తోనో...
ఆక్రోషించేవాడు...!
తీవ్ర సంఘర్షనతో తన హృదయ ప్రతిస్పందనలను...
అక్షరాలను భావానుగుణముగా.... తన కలముతో పేర్చి ,
కూర్చి అద్భుత మైన అస్త్రాలుగా మలచి సమాజముపై సంధించి సమరం చేస్తాడు....!
ఇందులో కలము, అక్షరము ఉపకరణాలు మాత్రమే...!
అవి కేవల కర్మలు...!
కర్త స్పందించి...ప్రతి స్పందించే హృదయముగ లవ్యక్తి మాత్రమే...
అతడే... కాలాన్ని శాసించే శక్తి...!
సమాజాన్ని బాగుచేసే వైద్యుడు...!!
నవాసమాజ నిర్మాత అతడే...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి