కొందరిని కలిసిన క్షణాలు మదిలో శాశ్వతంగా అట్లా వుండిపోతాయి. అలా కలిసినవి నాలుగు క్షణాలయినా నలభై ఎండ్లయినా అంతే. అందెశ్రీ తో నాకు ఆ తరహా పరిచయమే.
మేము 2001 డిసెంబర్ 7-8 రెండు రోజులపాటు మా ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ కాలేజి ఆడిటోరియంలో “తెలంగాణా మాండలిక సాహిత్యం” అన్న అంశం పై నిర్వహించిన సదస్సు మొత్తంగా తెలంగాణా అంతటా తెలంగాణా స్పృహను పెంచింది. తెలంగాణా భాష పైన జీవితం పైన కొత్త ఆలోచనలకు దారితీసింది. అంతే కాదు ఆ రెండు రోజుల సదస్సులో కాళోజీ దాశరథి లతో పాటు రచయితల్ని, కవుల్ని, కళాకారుల్నీ ఒకే వేదిక పైకి వచ్చేలా చేసింది. సెమినార్ రెండవ రోజు అంశం ‘తెలంగాణా పాట’. దానికి నేను అధ్యక్షున్ని. సదస్సులో శ్రీ బి.నరసింగ రావు మాట్లాడుతూ తెలంగాణా జీవన చిత్రాన్ని మన పాటలు ప్రతిబింబిస్తాయన్నారు. తెలంగాణా పాట పైన అందెశ్రీ గొంతెత్తి పాడుతూ సోదాహరణ ప్రసంగం చేసారు. ఏముంది ఆ పాటల సెషన్ అందెశ్రీ తో పాటు దేశపతి పాటలతో హోరెత్తిపోయింది. అందెశ్రీ తో నా తొలిtholi పరిచయం అది.
ఆ తర్వాత ‘తెలంగాణా రచయితల వేదిక’ ప్రధమ మహాసభల్లో నేను రూపొందించిన ‘ముద్దసాని రామి రెడ్డి డాక్యుమెంటరీ’ ఆవిష్కరణ జరుగగా అందెశ్రీ హాజరయ్యారు. అది తనను నేను రెండవ సారి కలవడం. అంతే కానీ ఆ పరిచయం నామదిలో అట్లా మిగిలిపోయింది. జరిగిన పరిణామాలు అన్నింటిని దూరం నుంచి చూస్తూనే వున్నాను. ఆనాటి అందెశ్రీ నా మదిలో అట్లా వుండి పోయాడు ఆయనకు నా నివాళి
+++++

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి