అలరించిన ఆత్మీయ సమ్మేళనం

 నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం లో కలం స్నేహం రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
 ఈ సమ్మేళనానికి వివిధ జిల్లాల నుండి కవులు, కవయిత్రులు, గాయని గాయకులు పాల్గొని తమ కవితలు పాటలు వినిపించారు.
 కలం స్నేహం వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ మాన్ గోపాల్ ఆచార్య మాట్లాడుతూ కళలు మానసిక వికాసానికి దోహదపడతాయని కలల పట్ల అభిరుచి కలిగించుకోవాలని తెలిపారు.
 కవులు సమాజం లో చైతన్యం తీసుకు వచ్చే కవితలు రాయాలని,పూర్వ కవులు  వ్రాసిన కవితలు చదవాలని కలం స్నేహం ద్వారా ఎంతోమంది కొత్త కవులకు మార్గ నిర్దేశం చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా డా.అప్పాల చక్రధారి,నేరెళ్ళ హనుమంతు, ఆత్మీయ అతిథులుగా  శ్రీమతి గోదావరి కమర్షియల్ ట్యాక్సీ ఆఫీసర్ శ్రీమతి సుమలత ఈజీ డబుల్ఆర్ఎస్ ప్రిన్సిపల్  నిర్వాకులు, దేవి ప్రియ,కడారి దశరథ్, కొండూరు పోతన్న శ్యామలరాణి తోట గంగాధర్, దేవిదాస్ కవులు కవయిత్రులు గాయని గాయకులు పాల్గొన్నారు
కామెంట్‌లు