వల్లాల ఆదర్శ పాఠశాలలో ఎన్ సి సి ఆవిర్భావ దినోత్సవా లు
 శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో NCC ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ సి సి విద్యార్థులచే వల్లాల గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది, ర్యాలీలో భాగంగా వల్లాల ZPHS పాఠశాలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులకు గౌరవ వందనం తెలపడం జరిగింది, తదనంతరం ఆదర్శ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ ర్యాలీలో విద్యార్థులు దేశభక్తి గురించి, NCC గొప్పతనం గురించి వివిధ రకాల నినాదాలు చేస్తూ వల్లాల గ్రామ నలుమూలల ర్యాలీ నిర్వహించడం జరిగింది,ఈ ర్యాలీ కార్యక్రమంలో NCC ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు గారు, పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు ఉపాధ్యాయులు దామెర్ల కృష్ణయ్య, చిత్తలూరి సత్యనారాయణ,మైదాసు సంపత్ కుమార్, ఇంకా ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
ఈ ర్యాలీ కార్యక్రమం విజయవంతం అవడంతో ముఖ్యపాత్ర పోషించిన NCC ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు గారిని మరియు దామెర్ల కృష్ణయ్య గార్లకు, విద్యార్థులకు ,ప్రిన్సిపాల్ కాటేపల్లి కృష్ణమోహన్ గారు అభినందనలు తెలియజేశారు
ఈ సందర్భంగా ఎన్ సి సి ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు గారు మాట్లాడుతూ.... ఎన్ సి సి విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి , సేవాభావం, బాధ్యత, స్వీయ నియంత్రణ, ఐకమత్యం, దృఢ సంకల్పం, సమయం విలువ ఇలా పలురకాల విషయాలు నేర్చుకుంటారు అని చెప్పారు

కామెంట్‌లు