మహత్యం!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
యక్షగానంలో స్వరాలు విరిగిపోతున్నవీ
ఉచ్చారణలో అక్షరాలు కరిగిపోతున్నవీ
గుండెలయల్లో ఉయ్యాలలు తెగిపోతున్నవీ
శ్వాసల్లో ఉఛ్వాసనిచ్వాసాలు కొసరుతున్నవీ!!

పెదవులపై శబ్దాలు రంగుల్ని అద్దుతున్నవీ
సంస్కార అమృతంలో మధువులూరుతున్నవీ
పుస్తకాల పొత్తిళ్లలో పొద్దులు ముద్దాడుతున్నవీ
నెమళ్ళ కళ్ళపై ముద్రలు దిద్దబడుతున్నాయి.!!

తాకితే తనువు వేణువుల ధ్వనిస్తుంది 
దేవుని ముందు ధ్వజస్తంభం ధ్యానం చేస్తుంది. 
శివుని ముందు నంది కలలు కంటుంది. 
ఆవుపాల జలపాతంలో ఎన్నో జన్మల నదులు పురుగు పోసుకుంటున్నవీ.

ఆలయాల ద్వారాల్లో ఎన్నో రాత్రుల నిద్దురలు చెదిరిపోతున్నవి. 
పొద్దుల పొత్తు ను తెంపిన మధ్యాహ్నం మకరందధం తాగింది. 

మెత్తని నీటిని శీతాకాలం గడ్డ కట్టించింది 
చల్లని నీటిని ఎండాకాలం ఆవిరి చేసింది 
ఎంత తాగినా దాహం తీరని ఋతువుల్లా దేహం నీటిలా మారింది. 

నిద్దురను మించిన మత్తు మగువది కాదా 
చల్లని తల్లి దీవెన దేవుని మహత్యం కాదా 
పచ్చని ఆకులో అన్నం రాజభోజనం కాదా!!!

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు