వందేమాతరం]:-అచ్యుతుని రాజ్యశ్రీ

 వం దనం జననీ అంటూ
దే శమాత చరణాల
మా తృదేవత మ్రోల 
త లలొంచిన త్యాగమూర్తులు
రం గారు బంగారు
భరతభూమిని ఆక్రమించిన 
బ్రిటిష్ వారి తుప్పు వదిలేలా ఉఫ్ మని ఎగిరేలా తొక్కి పెట్టిన 
ఆనందమఠం లో కలకలనినాదాలు 
శంఖారావాలు
బం గభూమిలో బంగారుతండ్రి
కిం కర్తవ్యమని ఆలోచించి
చంద్రకాంతులు వెలుగునిచ్చేవేళ
దైవ భక్తి దేశ భక్తి రంగరించి 
జగన్మాతను, దేశమాతను స్తుతిస్తూ అల్లిన గీతం
కోటి కోటి కంఠాలు కలకలనాదాలు
గలగలా జలజలా నదీ ప్రవాహాలు 
ఉప్పొంగె భారతీయుల గుండెలు
పరాయివాడి గుండెలు ఫెటీల్మని 
చిట్లేలా తారకమంత్రం వందేమాతరం
జూలువిదిల్చే భారతీయసింహాలు
తోక ముడిచె ఆంగ్లేయుల పాపాలు
నూటయాభైఏళ్ల ఘనచరిత్ర 
వందేమాతరం ఇదేనీకు మావందనం🌷
కామెంట్‌లు