మా శ్రీకాకులం , పార్వతీపురం మన్యం జిల్లాల ...
శ్రామికుల ప్రియమైన ఆహారమిది !
ఈ రాగి సంగటిని, పచ్చి పులుసుతో తిని...
కండలు తిరిగిన వారు
కొండల నైన పిండి సేతురు!
పండగ వస్తే.... ఈ తోప తో మేక తలకాయ పులుసునొ , బోటిపులుసు నొ , గొర్రె మా0సపు ఇగురునో వేసుకుని....
లొట్టలేసుకు తిందురు !!
గొప్ప వారి ఖరీదైన భోజనము లలో దొరకని పోషకము లెన్నొ...
ఈ రాగి సంగటి యిచ్చుచున్నది...!
ఈ కిటుకును తెలిసి...
ధనవంతు లంత....
ఈ చోడి పిండి తోనే...
చేసిన జావను ...
రాగి మాల్ట్ ఆంటు...
స్టైల్ గా త్రాగు చు0డుటే విశేషము..!
ఒకప్పుడు బొప్పాయి నెవరు తినే వారె కాదు!
మునగా కెవరికి అక్కర లేదు...
వాటి విలువ తెలిసి ఈనాడు డబ్బు లిచ్చి మరీ కొంటున్నారు...!
ఆయుర్వేదము తెలిసిన వారు వీటిని చక్కగ వినియో గిస్తున్నారు
వాట్సాపులలో చక్కని
ప్రచారములును వచ్చుచు న్నవి
సహజముగా మన ప్రక్రుతి యిచ్చే పదార్ధములలో
ఎన్నో పోషకము లున్నవి
తెలుసుకుని అందరు...
వినియోగించండి ...
ఆరోగ్యంతో,ఆనందంతో
హాయిగా జీ వింఛండి !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి