మీ కివే మా..:- కోరాడ నరసింహా రావు .
అంత వరకు  పాండిత్య ప్రదర్శన, ప్రకృతి ,స్త్రీల అంగాంగ వర్ణన, రాజుల వీ రత్వఅతిశయోక్తులు...
ఇవే కవితా వస్తువులు! 

కందుకూరి ఆ వరవడిని తిరగ రాసి, కొందరి పండితులకే పరిమిత మైన కవిత్వాన్ని సర్వజనీనం చెయ్యటం కోసం అందరికీ అర్ధమయేవ్యవహారికభాషతో , జన జీవన స్థితిగతుల నే కవితా వస్తువుగా.... 
 "సమాజ హితేన సాహిత్యం! " అంటూ కవిత్వానికి మహోన్న త త్వాన్ని కలిగించారు ! 

 దీన్ని పరిపుష్టం చేసి... మరింత మునుముందుకు తీసుకు పోయిన ఘనత మన గురాజాడకే దక్కింది

అది తరువాత శ్రీ శ్రీ వంటి ఎందరో మహా కవులకు మార్గ దర్శనం అయింది!! 

గురాజాడ అంటె... 
  సమాజ చైతన్యం... 
     యువకవుల స్పూర్తి... 
    నవ సమాజ నిర్మానం
  సా0ప్రదాయ వాదాన్ని వ్యతిరేకించగల సాహసం! 

నవ కవిత్వం కోసం అవతరించిన మహామనీషి
గురజాడ...! 
  సమాజ వికాసం కోసం ప్రవహించిన జీవనది గురాజాడ...!! 

తర తరాలు స్మరించుకునే 
 అవతారమూర్తి గురాజాడ
 అతడు నడచిన మార్గమే 
ముందు తరాలకు అడుగు జాడ...! 

ఓ మహోన్నత కవితా మూర్తి... 
   మా అందరి చైతన్య స్పూర్తీ .... 
 మీ కివే మా పాదాభి వందనములు
💐🙏🌷💐🙏🌷

కామెంట్‌లు