సత్యతపుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరుణి  అనే మహర్షి దేవికా నది ఒడ్డున  ఆశ్రమంలో ఉంటున్నాడు.పంజాబ్ లోని దెగ్ పేరు ఆకాలంలో దేవిక.మహాభారతం స్కందపురాణంలో ఈనదిప్రస్తావన ఉంది.ఆరుణి నదీస్నానం ముగిసిన తర్వాత జపానికి కూర్చున్నప్పుడు ఓవేటగాడు కన్పడ్డాడు.వాడు ఋషిని చూడగానే భయపడ్డాడు." స్వామీ! నేను వందలాదిమందిని చంపిన పాపాత్ముడిని.మీవర్చస్సుతో నామనసు మారింది.నేనూ మీలాగా తపస్సు చేస్తా" అన్నాడు.కానీ ఆరుణి జవాబీయలేదు.ఆయన్ని గమనిస్తూ వేటగాడు కూడా తపస్సులో కూచున్నాడు.ఓరోజు ఆరుణి నదిలో దిగి స్నానంచేస్తున్నప్పుడు పెద్ద పులి ఆయన పై దూకబోతుంటే గమనించిన వేటగాడు దానిపై బాణం వదిలాడు.అప్పుడే ఆరుణి" ఓంనమోనారాయణాయ" అనటంవిన్న పులి లోంచి ఓదివ్యపురుషుడు బైటకి వచ్చాడు." స్వామీ! పూర్వజన్మ లో నేను దీర్ఘబాహుడనే రాజుని.అన్ని శాస్త్ర పురాణాలు చదివాను.కానీ అహంకారంతో బ్రాహ్మణులని అవమానించాను.నన్ను పులిగామారమని శపించారు.శాపవిమోచనం చెప్పారు.ప్రతి నెల ఆరోరోజు కనపడ్డ వ్యక్తిని తినే యత్నం చెయ్యి.నీవు బాణం దెబ్బ కి ప్రాణం పోయే సమయంలో ఓంనమోనారాయణాయ అన్న శబ్దం విన్పడగానే శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పారు." ఆపై అతను స్వర్గంచేరాడు. ఆరుణి ఆవేటగాడిని ఇలా అనుగ్రహించాడు"నీవు తపస్సుచేస్తూ ఉండు.నీపాపాలు పోతాయి". ఆరుణి తన దోవన తాను వెళ్లి పోయాడు.దుర్వాసమహర్షి ఆవేటగాని  దగ్గర కొచ్చాడు. అతని తపఃఫలం గా ఆకాశంనుంచి బంగారుపాత్రలో భోజనం రావటంతో దుర్వాసమహర్షిని ఆహ్వానించాడు. ఆరుణి ని తల్చుకుని దేవికానదిని స్తుతించాడు. ఆనది దుర్వాసుని దాకా వచ్చి ఆయన పాదాలు కడిగింది. ఆయన అనుగ్రహంతో  సత్యతపా అనే పేరుతో ఒకమహర్షిలాగా వెలుగులోకి వచ్చాడు. ఎంతచెడ్డవాడైనా భక్తిమార్గంలో పడితే మంచివారిని కలిస్తే ఉత్తమునిగా మారి జీవితం సార్ధకం చేసుకుంటాడు🌷
కామెంట్‌లు