చాచా నెహ్రూ సేవలు దేశానికి ఆదర్శం

 పంటపొలాలకు నీరు అందించే ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని విశ్వసించి, ప్రధానమంత్రిగా ఒకటిన్నర దశాబ్దాల పాటు భారతదేశాన్ని సంస్కరించే దిశగా పరిపాలించిన చాచా నెహ్రూ సేవలు దేశానికి ఆదర్శనీయమని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవం కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ చాంతాటి లక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర్య సముపార్జన కోసం జైలుకి కూడా వెళ్ళిన దేశభక్తుడు శాంతిదూత నెహ్రూజీ అని అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ ఎ టు పరీక్షలలో మిక్కిలి ప్రతిభ కనబర్చిన దువ్వు కావ్య, బీసింగి హారిక, చల్లా చాందిని, చాంతాటి తేజేశ్వరి, డొప్ప రాజేశ్వరి, డొప్ప యామిని, బత్తుల లిఖిత, శనగల సురేష్ లను అభినందిస్తూ బహుమతులను అందజేశారు. 
అలాగే ఆటల పాటల పోటీల్లో విజేతలైన షేక్ లతీఫ్, శనగల వరుణ్ తేజ్, లోపింటి లక్ష్మి, పలిశెట్టి రోహిత్, పులప మోక్షిత్ రామ్, కెల్ల సాయిభావన, పలిశెట్టి వేదవాసిని, చిర్రా అమృత, సిరిపురపు హేమలకు బహుమతులను అందజేశారు. మిక్కిలి క్రమశిక్షణ కలిగిన ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన బత్తుల లిఖితకు కండువా, జ్ఞాపిక, నగదు పారితోషికం, గ్రంథాలతో ఉపాధ్యాయులంతా సత్కారం గావించారు. అలాగే ఉత్తమ బాలలుగా ఎంపికైన తోపల సునంద, బూర్లె రోహిణి, అలజంగి నవ్యలకు బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించారు.
అలాగే జిఎంఆర్ విఎఫ్ సిఎస్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినయ గేయాల పోటీల్లో పలిశెట్టి మోక్షిత్ రామ్, బీసింగి సౌమ్య, ఇన్ ద పాండ్ ఆన్ ద బేక్ పోటీల్లో డొప్ప దర్శిని, పలిశెట్టి ఆనంద్, నీతి పద్యాల పోటీల్లో దారకొండ హేమశ్రీ, బీసింగి ఉమ, దేశభక్తి గీతాల పోటీల్లో పండూరి కృష్ణ, దువ్వు నీహారిక, ఎక్కముల పోటీల్లో దారకొండ హేమలత, లోపింటి యోచన, మెమొరీ టెస్ట్ పోటీల్లో చల్లా చాందిని, బీసింగి హారిక, నెహ్రూ చిత్రలేఖన పోటీల్లో డొప్ప యామిని, కెల్ల సాయి సంపత్, నెహ్రూ వ్యాసరచన పోటీల్లో బత్తుల లిఖిత, శనగల సురేష్ లకు బహుమతులను అందజేసారు. 
తొలుత నెహ్రూ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ చాంతాటి లక్ష్మి, ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం.పెంటయ్య,  జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొని ప్రసంగించారు.
ఎస్ ఎం సి ఛైర్ పర్సన్ సిహెచ్ లక్ష్మితో పాటు జిఎంఆర్ విఎఫ్ సిఎస్ వింగ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ లావేటి రాజు, సంస్థ ప్రతినిధులు పి.వాసు, బి.గోవింద, పి.దాలమ్మ, గ్రామ పౌరులు బత్తుల రామలక్ష్మి,  దిల్ షాద్ బేగం, పి.చంద్రమ్మ, చిర్రా అలివేలు, పి.శ్యామల తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు