బాలలనేస్తం...జే జే లు:- కోరాడ నరసింహా రావు!
చా చా నెహ్రూ నేస్తాలు
   ముద్దు, మురిపాల పిల్లలు...! 
  చా చా మనసును దో చారు...!! 

తన పుట్టిన రోజును... 
  ఉల్లాసంగా ఉత్సాహంగా
   పిల్లల తోనే జరుపుకునే
     పండిట్ నెహ్రూ ....! 

బాలలు యిచ్చే ఎర్ర గులాబి
   తన గుండెలపై కోటుకు పెట్టి 
   మురిసి పోవును చాచా నెహ్రూ...! 

రేపటి పౌరులు మీరని
  దేశానికిఖ్యాతినితేవాలని
    చా చా  కన్న కలలన్నీ 
  మీరు నిజం చేయాలి ! 

మాయా మర్మము 
   ఎరుగని బాలలు
 కల్లా, కపటం 
    తెలియని బాలలు
 నెహ్రూమనసును దోచారు
    చ రి త్ర లో  నిలిచారు ! 
      ******

కామెంట్‌లు