నమ్మకం:- - యామిజాల జగదీశ్
 కంటిచూపు లేని ఒకరు ఆలయానికి వెళ్ళారు.
అర్చకుడు ఆయనను చూసి అడిగారు...
"అయ్యా! మీకు కళ్ళు కనిపించవు కదా....కొండెక్కి...
వరుసలో నిల్చుని ఇంత శ్రమపడి వచ్చారు...దేవుడ్ని మీరు దర్శించి లేరుగా".
అంధుడు ఇలా అన్నారు...
"అయ్యా! మీరడిగిన దాంట్లో తప్పేమీ లేదు. నేను చూడటంలో దేవుడికేమిటి ఆనందమూ...లాభమూ...
దేవుడు నన్ను చూస్తే చాలండీ. నా కష్టాలన్నీ పారిపోతాయి అనే నమ్మకంతో వచ్చాను" 
ఇదే నిజమైన భక్తి.
నిజమైన ఆరాటం.
నిజమైన విశ్వాసం.

కామెంట్‌లు