తండ్రి టీ అమ్మిన కోర్టు ఆవరణలో కూతురు జడ్జీ!!:- - యామిజాల జగదీశ్

 అయిదేళ్ళ క్రితం నాటి సంఘటన.
ఆమె చుట్టూ అనేక మంది విలేకరులు. ప్రశ్నల మీద ప్రశ్నలు.ఆమె పేరు శృతి. అప్పుడు ఆమె వయస్సు 24 ఏళ్ళు.
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ కోర్టులో ఇప్పుడు జడ్జీగా ఉన్నారు.కోర్టు ఆవరణలోనే విలేకరులు ఆమెను కలిసారు.ఆమెను విలేకరులు అడిగిన ప్రశ్న...ఇంత చిన్న వయస్సులో మీరెలా మేడమ్ ఇంత పెద్ద పోస్టుకి ఎదిగారు...మీ కుటుంబం బాగా పలుకుబడి గల కుటుంబమా...శృతి కాస్సేపు మౌనంగా ఉన్నారు.ఏమీ మాట్లాడలేదు.కాస్సేపు తర్వాత ఆమె నెమ్మదైన స్వరంలో చెప్పారు కాదు...మా కుటుంబం చాలా సాధారణమైనది. నేనొక పల్లెటూరు అమ్మాయినే అని చెప్పారామె.
అనంతరం విలేకరులు అడిగారు... “మేడమ్, మీ కుటుంబం....అదేనండి మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి...?”
శృతి నుంచి మళ్ళీ మౌనం.
విలేకరులకు ఏమీ అర్థం కాలేదు.
మేమడిగింది జడ్జీకి అర్థం కాలేదా అని విలేకరులు ఒకరి వంక చూసుకున్నారు. మేడమ్. మేము అడిగిన ప్రశ్నకు మీరింకా జవాబు చెప్పలేదండీ అన్నారు విలేకరులు.  
సారీ..ఏమడిగారు అన్నారు శృతి.
“మీ అమ్మా నాన్నా... ”
శృతి విలేకరుల వంక తదేకంగా చూశారు.
ఒక్క నిముషం నాతోపాటు బయటకు రావడానికవుతుందా ప్లీస్ అన్నారు శృతి.
 విలేకరులు ప్రశ్నించారు...ఎక్కడికి మేడమ్ రమ్మంటున్నారు అని.
శృతి నడుస్తూనే విలేకరుల వంక చూసి మా నాన్నను మీకు పరిచయం చేయాలి కదా...అన్నారు.
అవునన్నారు విలేకరులు.
ఓహో అంటూ విలేకరులు కెమేరాలను సిద్ధం చేసుకుని నడక సాగించారు..శృతి వేగంగా నడుస్తూ చెప్పారు మా నాన్న ఈ కోర్టు ఆవరణలోనే ఉన్నారు అన్నారు.
విలేకరులకు ఆశ్చర్యం.
ఓ విలేకరి అడిగాడు ఓహో...మీ నాన్న సీనియర్ జడ్జా మేడమ్....
కాదు అన్నారు శృతి.
మీ నాన్నగారు సీనియర్ అడ్వొకేటా మేడమ్ అడిగాడు ఇంకొక విలేకరి.
కాదు అన్నారు శృతి.
వేగంగా నడిచిన శృతి కోర్టు ఆవరణలో ఓ చెట్టు నీడలో నిల్చున్నారు.
విలేకరులను చూసి మనమందరం ఛాయ్ తాగుదామా అని అడిగారు  
విలేకరులు చెట్టు నీడలోకొచ్చి తాగుదాం అన్నారు.
అక్కడ ఛాయ్ తయారు చేస్తున్న ఓ పెద్దాయన వారి వంక చూశారు.
ఆయన వంక చూసిన శృతి అందరికీ కాఫీ ఇవ్వండి అని అడిగారు
ఆ పెద్దాయన అందరికీ టీ తీసుకొచ్చి ఇచ్చారు. టీ తాగిన తర్వాత విలేకరులు మేడమ్ మీ నాన్నగారిని పరిచయం చేస్తానన్నారు, వెళ్దామా అని అడిగారు.
శృతి విలేకరుల వంక చూసి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు.
అదేనండి మీ నాన్నగారిని చూడటానికి అన్నారు విలేకరులు.
శృతి ఓ చిన్న నవ్వు నవ్వారు. అవును కదూ మీకు ఆయనను పరిచయం చేస్తానన్నాను కదూ....ఫోటో తీసుకోండి అంటూ శృతి కాస్సేపటి క్రితం అందరికీ టీ ఇచ్చిన పెద్దాయనను పిలిచారు.
నాన్నా ఇక్కడికి రండి...వీళ్ళకు మిమ్మల్ని పరిచయం చేయాలి అన్నారు శృతి.
 నిశ్చేష్టులయ్యారు విలేకరులు. నోటంట మాట లేదు.
శృతి టీ ఇచ్చిన ఆ పెద్దాయన పక్కన నిల్చున్నారు. ఈయనే మా నాన్న....ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఇదే చోట టీ అమ్ముతున్నారు. ఈ కోర్టు ఆవరణలోకి వచ్చే వారందరూ ఆయన కొట్టులో టీ తాగుతారు. ఆయన ఎంతో కష్టపడి నన్ను చదివించి ఈ స్థాయిలో నిలబెట్టారు. ఆయన టీ అమ్ముతున్న ఈ ఆవరణలోని కోర్టులోనే నేను జడ్జీగా ఉన్నాను.
.విలేకరులు ఆమె మాట వింటూ మౌనంగా నిల్చున్నారు.
సరే ఫ్రెండ్స్...మనం పోదాం...ఆయన పని చేసుకోవాలి అని ముందుకు అడుగులు వేశారు.
ఆమె కోర్టు బాల్కనీలోకి నడిచి వెళ్తుంటే ఆ పెద్దాయన తన కూతురి వంక గంభీరంగా చూశారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి.
గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసిన తర్వాత శృతి పాటియాలాలోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో లా చేశారు. పంజాబ్ లోని ఓ చిన్నపాటి పట్టణమైన నకోదర్ కు చెందిన శృతిదేవుళ్ళందరూ ఓడిపోతారు తండ్రి ప్రేమ ముందు. లాలిపాట పాడే తల్లి ప్రేమ కూడా తండ్రి ప్రేమ తర్వాతేసుమీ.
కామెంట్‌లు