ప్రేమానురాగాలు పంచి
మలమూత్రాదులను తుడిచి
పసిడి బొమ్మలా తయారు చేసి
వెండిగిన్నెలో పాలుబువ్వను గోరుముద్దలు గా చేసి
చందమామ రావే అని పిలుస్తు తినిపించి
ఓపిక ఉన్నా లేక పోయినా
ఎత్తుకుని
నీ ముద్దు మాటలు చేష్టలతో మురిసి
సర్వస్వం నీ కోసమే అని
తాను తిన్నా తినక పోయినా
నీ కడుపు నింపి పెద్దవాడివి అయినా
నలతగా ఉంటే పరవాలేదురా కన్నా అని
నిన్ను ఆప్యాయంగా తలనిమిరి
తన హృదయానికి హత్తుకుని
నా ఆయుష్షు కూడా పోసుకో అని
తపన పడే మాతృమూర్తిలందరు
జగతిన యశోదమ్మలే..!!
అమ్మ పిలుపు అమృతం
అమ్మ ఒడి స్వర్గం
అమ్మ కొంగు రక్షణ
అమ్మ శ్వాస ప్రాణం
అమ్మ నడయాడే దైవం
అందుకే అమ్మ జగతిన
పరదేవతా స్వరూపమే...!!
.................................
మలమూత్రాదులను తుడిచి
పసిడి బొమ్మలా తయారు చేసి
వెండిగిన్నెలో పాలుబువ్వను గోరుముద్దలు గా చేసి
చందమామ రావే అని పిలుస్తు తినిపించి
ఓపిక ఉన్నా లేక పోయినా
ఎత్తుకుని
నీ ముద్దు మాటలు చేష్టలతో మురిసి
సర్వస్వం నీ కోసమే అని
తాను తిన్నా తినక పోయినా
నీ కడుపు నింపి పెద్దవాడివి అయినా
నలతగా ఉంటే పరవాలేదురా కన్నా అని
నిన్ను ఆప్యాయంగా తలనిమిరి
తన హృదయానికి హత్తుకుని
నా ఆయుష్షు కూడా పోసుకో అని
తపన పడే మాతృమూర్తిలందరు
జగతిన యశోదమ్మలే..!!
అమ్మ పిలుపు అమృతం
అమ్మ ఒడి స్వర్గం
అమ్మ కొంగు రక్షణ
అమ్మ శ్వాస ప్రాణం
అమ్మ నడయాడే దైవం
అందుకే అమ్మ జగతిన
పరదేవతా స్వరూపమే...!!
.................................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి