అత్యున్నత చట్టం - భారత రాజ్యాంగం

 భావితరాల అంతరంగం భారత రాజ్యాంగమని, అది దేశానికి అత్యున్నత చట్టమని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు అన్నారు. 
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత గ్రంథం భారత రాజ్యాంగమేనని పరిపాలక వ్యవస్థకు ఇది ఒక నియమావళిగా నిలుస్తుందని తిరుమలరావు అన్నారు. పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులచే భారత రాజ్యాంగ ప్రవేశికను ఉపాధ్యాయని ఉప్పలపాటి ఆదిలక్ష్మి చదివించగా, ఉపాధ్యాయులు యందువ వెంకటరమణ ప్రతిజ్ఞ గావించిరి. ప్రత్యేక ప్రసంగం చేసి వెలగాడ రాము విద్యార్థులందరికీ నేటి కార్యక్రమం పట్ల అవగాహన కలిగించారు. ఉపాధ్యాయులు, తొలుత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. క్విజ్ పోటీల్లో శనగల సురేష్ గ్రూప్ ప్రథమ స్థానంలో, వురిటి సాయి హర్ష వర్ధన్ సుధీర్ గ్రూప్ ద్వితీయ స్థానంలో నిలిచారు. దేశభక్తికి సంబంధించిన అంశాలపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా బత్తుల లిఖిత, డొప్ప డిల్లేశ్వర్, సయ్యద్ జుబేర్, డొప్ప రాజేశ్వరి, అలజంగి నవ్య, ఆర్.అనితలు నిలవగా, కన్సోలేషన్ బహుమతులకు అమృత, యామిని, నిఖిల్, హేమ, రోహిణి, వాసు, రోహిత్, భాను, నాగేంద్రలు ఎంపికయ్యారు. డా.బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర గూర్చి నిర్వహించిన వ్యాసరచన   పోటీల్లో శనగల సురేష్, బత్తుల లిఖిత, సయ్యద్ జుబేర్ లు తొలి మూడు స్థానాల్లో నిలవగా కన్సోలేషన్ బహుమతులకు రాజేశ్వరి, సాయి సంపత్, యామినిలు ఎంపికైనారు. భారత రాజ్యాంగం ఆవశ్యకత అను అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ప్రథమ స్థానాన్ని బత్తుల లిఖిత, ద్వితీయ స్థానాన్ని డొప్ప రాజేశ్వరి సాధించారు. వీరందరికీ బహుమతులను అందజేసిన అనంతరం, ఈనాటి వేదికపై వివిధ రకాల వేషధారణలో ప్రదర్శనలు జరిపిన విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులంతా అభినందిస్తూ బహుమతులను బహూకరించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ గా బొబ్బిలి రోహిత్, షేక్ లతీఫ్, రుద్రమదేవిగా డొప్ప రాజేశ్వరి, ఝాన్సీ లక్ష్మీబాయిగా డొప్ప యామిని, చిర్రా అమృత, చాచా నెహ్రూగా సయ్యద్ జుబేర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గా డొప్ప డిల్లేశ్వర్, మహాత్మా గాంధీగా కొప్పిశెట్టి అప్పలకొండలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అభ్యుదయ గీతాలు ఆలపించి, రాజ్యాంగం గూర్చి ప్రసంగించారు. ఇదే వేదికపై సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావును విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మ, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు బత్తుల రామలక్ష్మి, కొర్నాన సీతారాం, చిర్రా అలివేలు, చిర్రా లక్ష్మి, పలిశెట్టి చంద్రమ్మ, పలిశెట్టి శ్యామలలు శాలువా, కానుకలు, వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు