ఒక రోజు ఒక చీమ ఒక యాపిల్ పట్టుకొని చెట్టు వద్దకు నిలబడింది. అక్కడే కొంత దూరం లో ఒక ఉడుత ఉన్నది. ఉడత చీమతో మిత్రమా పండు ఎక్కడిది, మనం ఇద్దరం సమానం గా తిందామా అనగానే చీమ లేదు లేదు నేను ఒక్క దాన్నే తింటాను అన్నది. ఉడుత సరే మిత్రమా నేను కొంచెం తీసుకుంటా, నువ్వు మరింత ఎక్కువ తీసుకో అన్నది.చీమ సరే అని ఓ ఉడుతా మనం కోసుకొని తింటానికి మన దగ్గర కత్తి లేదు అనగానే అవును మిత్రమా మన దగ్గర కత్తి లేదు అన్నది ఉడుత. చీమ వెంటనే నాకొక ఉపాయం వచ్చింది మిత్రమా అది ఏంటిదంటే నీ దృడమైన పళ్ళ తోటి దీన్ని కొరుకు అన్నది. ఉడుత సరే మిత్రమా నా దృఢమైన పళ్ళ తోనే దీన్ని కొరుకుతాను అని రెండు ముక్కలు చేసి, నువ్వు మాత్రం మంచి ఉపాయం చెప్పావు మిత్రమా అన్నది ఉడుత. వెంటనే ఆ చీమ ఒక ముక్కను తిని చాలా తియ్యగా ఉన్నది మిత్రమా! జీవితం లో ఇంత మంచి పండును ఎక్కడ తిన లేదు మిత్రమా అన్నది. ఉడుత వెంటనే అవును మిత్రమా అన్నది. చీమా నువ్వు ఎక్కడ కోసుకొచ్చావు అన్నది. అవును చాలా బాగుంది కదా అన్నది చీమ. నువ్వు మంచి మిత్రునివి అన్నది ఉడుత. నువ్వు కూడ మంచి మిత్రునివే అన్నది చీమ. తరువాత సరే భాయ్, నిమ్మళంగా పోయిరా అన్నది ఉడుత. సరే నువ్వు కూడ పోయిరా అన్నది చీమ.
నీతి :- స్వార్థం వదిలి, పరులకు ఉపకారం చేయాలి.
నీతి :- స్వార్థం వదిలి, పరులకు ఉపకారం చేయాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి