ఇలా అలా అని చెప్పడానికి నువ్వెవరు?:- - యామిజాల జగదీశ్
 "నేను ఇలా చేస్తాను... అలా చేయనని చెప్పడానికి నువ్వెవరు? ఒక గొప్ప శక్తి ప్రతి దానినీ నడిపిస్తోంది... నువ్వొక దానిని చేయనని చెప్పినప్పుడు నువ్వు దేనినీ నియంత్రించలేవనే వాస్తవాన్నీ తెలుసుకోవాలి...కనుక ఆ శక్తిని గ్రహించి, దాని సాధనంగా నిన్ను నువ్వు నియంత్రించుకో...నిన్ను నీవు నియంత్రించుకోలేకపోతే... అది నిన్ను బలవంతంగా చేస్తుంది....నీవు చేయవలసిన పనిని చేయాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే.
ఇష్టం లేకుండా చేసే బదులు, దానిని అంగీకరించి ఆనందంతో చేయాలి....
మనం ఎవరో తెలుసుకుని, మనకు ఏ పని అప్పగించినా, మనమే దానిని చేయాలనే ఆలోచన లేకుండా చేయాలి. నువ్వలా చేస్తే, నీ కర్మ ఫలం ప్రభావితం కాదు.
అదే పట్టుదల, దృఢ సంకల్పం, ప్రతిదీ ఆత్మ నుండి స్వతంత్రంగా మారుతుంది.
ఇది భగవద్గీత సారాంశం. ఉద్దేశ్యం, ఆత్మ నుండి స్వతంత్రంగా మారడం.
ఒకరు ఆత్మ నుండి స్వతంత్రంగా మారితే, ఏ సందేహమూ రాదు. అన్ని సందేహాలు ఆత్మలో స్థిరపడే వరకు..." అంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి.

కామెంట్‌లు