గణపతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 గణేశుడు వినాయకుడు గణపతి పేరేదైనా విఘ్నాలు తొలగించు ఆదిదేవుడు. ఆయన గూర్చిన కొత్త కథ ఇది నార్త్ ఇండియాలో ప్రచారంలో ఉంది.ప్రజాపాలకుడు అనే రాజు తపస్వి మహాతపా ఆశ్రమానికెళ్లాడు.ఆయన ద్వారా వినాయక కథను విన్నాడు.మంచివారు చేసేపనుల్లో విఘ్నాలు ఆటంకాలు వచ్చేవి వారు ఏపని చేయాలని మొదలుపెట్టినా! చెడ్డ వారి పనులు చకచకా సాగేవి.దేవతలంతా శివుని దగ్గరకు పరుగెత్తారు కైలాసంచేరారు."శివా! దానవులు నిర్విఘ్నింగా పనులు పూర్తిచేసి మాపై దాడిచేస్తున్నారు.మాకుమీరే దిక్కు".శివుడు సమాధిస్థితిలో విని ఆలోచన చేశాడు.పృథ్వి జలం అగ్ని వాయువు నాకు కన్పడుతున్నాయి కానీ ఆకాశం శరీరధారి కాదు. హఠాత్తుగా పరమేశ్వరునికి నవ్వు వచ్చింది. బ్రహ్మ అన్న మాట అది" ఆకాశంకి శరీరధారణలేదు.అందుకే ఆకారం కన్పడదు.ఇంకా నవ్వు పూర్తికాకుండానే తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడు ఎదుట నిలబడ్డాడు.విష్ణువు గుణాలన్నీ స్పష్టంగా కన్పడుతున్నాయి.రెండో శివునిలా వెలిగిపోతున్నాడు.ముద్దులొలికే ముచ్చటగొల్పే ఆచిన్నారిని పార్వతి అలా చూస్తూ ఉండిపోయింది. శివుడు పిలుస్తున్నా వినిపించుకోలేదామె.అంతే ఆయనకి కోపం వచ్చి చిన్నారి పై చూపాడు. "అరే బాబూ! నీకు ఏనుగు మొహం బానబొజ్జరావాలి.పాము నీకు జందెం ఉంటుంది." దేవతలతో సహా పార్వతి చాల బాధపడుతుండగా బ్రహ్మ వచ్చాడు." పరమేశా! నీకోపం ఆపసివానిపై చూపటం తగదు.ఆచిన్నారికి ఆయుధాలిచ్చి ఆశీర్వదించు." అప్పుడు శివుడు" నాయనా! నీవు వినాయక విఘ్నహర, గజాస్య,భవపుత్ర అనేపేర్లతో ప్రసిద్ధి కెక్కుతావు. ముందుగా నిన్ను పూజిస్తారంతా విఘ్నాలు తొలగించమని. " మహాతపుని కథ విన్న  రాజు చాలా సంతోషించాడు. అలా అగ్రపూజ అందుకునే దేవుడు గణపతిని విద్యార్థులు కొలవాలి🌹
కామెంట్‌లు