ఆఫర్ల మాయలో పడితే అంతేమరి!!:- - యామిజాల జగదీశ్
 ఒక వ్యాపారవేత్త ఒక కొత్త "జూ పార్కు" ప్రారంభించాడు. జూ సందర్శనకు ప్రవేశ రుసుము 50 రూపాయలుగా నిర్ణయించాడు. అయితే ఎవరూ రాలేదు. అతను దానిని 25 రూపాయలకు తగ్గించాడు. అయినప్పటికీ ఎవరూ రాలేదు. అతను 20 రూపాయలకు తగ్గించాడు. అప్పుడు కూడా సందర్శకులు లేరు. తర్వాత 10 రూపాయలకు తగ్గించినా ఫలితం లేకపోయింది. అతను వెంటనే ఆలోచించాడు. అమలు చేశాడు. అతను ఓ ఆఫర్ ప్రకటించాడు. "ప్రవేశ

రుసుము లేదు... ప్రతిదీ ఉచితం" అని. 
అంతే, మరం క్షణం, సందర్శకులతో జూ కిటకిటలాడింది. నిర్వాహకుడికి ఆనందమే ఆనందం. 
జూ పార్క్ జనంతో నిండిపోయింది. అప్పుడతను తన ఆలోచన ప్రకారం ప్రవేశ ద్వారం మూసివేసాడు. బోనులో ఉన్న సింహాన్ని బయటకు విడిచిపెట్టాడు. ప్రజలు అరుస్తూ బయటకు వెళ్ళిపోవడానికి గేటు దగ్గరకు వచ్చారు. అయితే నిర్వాహకుడు ఏం చేశాడంటే అదే అదునుగా "బయటకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు 200 రూపాయలు చెల్లించాలి" అని చెప్పాడు.
ఈనాడు మనం ఇలానే చాలా వాటికి ఆఫర్ల పేరుతో (మొబైల్, వైఫై, ఇంటర్నెట్ టీవీ మొదలైనవి) ఎన్నింటికో మామూలు కన్నా ఎక్కువగా చెల్లిస్తున్న విషయాన్ని మర్చిపోతున్నాం.
కామెంట్‌లు