సామెత -48: అర్థశేరు బియ్యం తింటావురా అంటే-అంతా తిన మూడు మెతుకులు విడిచి పెడ్తానన్నాడట.
****
ఇల్లాకిలి ఊడ్చి,పనిదీర్సుకుని ఇరుగు పొరుగు అమ్మలక్కలతో ముచ్చట బెట్టుకుంట అరుగు మీద కూసుంది.
"అవ్వోయ్! ఓ అవ్వా! అన్కుంట పగలబడి నవ్వుకుంటొత్తున్న రాజమ్మ కేలి కూసున్నోళ్ళందరు ఒక్క తీర్గ సూడబట్టిండ్రు.
గంతగనం నవ్వబడ్తివేందే శెల్లె! యిషయమేందో శెప్పి నవ్వరాదే! తను సుత నవ్వుకుంట అడిగింది అవ్వ.
నిన్న ఐతారం పొద్దు పొద్దున్నే మా అక్క మన్వడు టుక్ టుక్ మోటరు మీద టీక్ టాక్ గా వొచ్చిండవ్వా! సూత్తే పడుసుపోరడు.సైమానికి ఇంట్లె ఇడ్డిలీ పిండి ఉండబట్టి పర్వు దక్కింది. రెండు వాయిల ఇడ్డిలీలు నాస్తా జేసి పెట్టిన.ఇంకున్నయేమో పెట్టుమన్నట్టుగ గాడు నా మొగం జూత్తుంటె ఇజ్జత్ బోయిందన్కో.గీ మద్దెన్నే జేసిన రెండు కొబ్బరుండలు తిను మన్వడా అన్కుంట చేతికిచ్చిన. గప్పుడు ఆడు మొగంలో తిన్న తుర్తి జూసినంక అమ్మయ్య పర్వు దక్కింది.రాక రాక నా మన్వడు సూడనీకి వొత్తె గాడికి కడ్పునిండ టిపిని సుత బెట్లేదని మా యక్క అన్కుంటదని లోపల్లోపల బుగులు బడ్డ.
గదినంగనే అమ్మలక్కలు ఎదురొమ్మున చెయ్యేస్కుని "వామ్మో!రెండు వాయిల ఇడ్డన్లే.డజన్కి రొండు తక్వ.వామ్మో గాడిది కడుపా? చెర్వా?అన్కుంట నవ్వబట్టిండ్రు.
ఓ అక్కో! గాడి తిండి పుట్టి ముచ్చటింక ఒడ్వలే. వొత్తున్న నవ్వు నాపుకుంట ఇంగ మద్దేనం ముచ్చటుంది. గామాట ఈ మాట మాట్లాడే తల్కి సనువు బెరిగింది. మా ఆయ్న చెర్ల పట్టిండ్రని రొండు కిలల శేపలు బట్కొచ్చిండు. ఓ కిల శేప ముక్కలు నూనెల గోలిచ్చి మాల్ మషాలేసిన. ఇంకో కిల కమ్మగ పులుసు బెట్టిన. అర్థశేరు బియ్యం అన్నమొండిన. మా ఆయ్న తినేది పిట్ట మెత్కులేనాయె. నాకియ్యాల సోమారం.నీసు దిననాయె.
ఇద్దర్ని బోజనాన్కి లేపిన.మా ఆయ్న తర్వాత్తింట తీ అన్కుంట, ముందుగాల మన్వడికి బెట్టమని బయటికెళ్ళిండు.పులుసు గిన్నె , శేపలు గోలిచ్చిన మూకుడు దెగ్గర బెట్టిన.శేపలంటే చానా ఇట్టం గని సప్పసప్ప తిండం రాదమ్మమ్మా అన్నడు.పుర్సత్ గా తిను మన్వడా! తొందరేమొచ్చిందన్న. ఇంతల్కె జీతగాడు బర్రె ఈనేట్టుంది.ఆపతి బడ్తాంది. కాత్త కొట్టంల కొత్తరా అమ్మగారూ!" అని పిలుత్తుంటే "మొగమాటం లేకుంట తిను మన్వడా!" అనెళ్ళిన.
ఇంగ కొట్టంల అన్ని సవరిచ్చి వొచ్చేతల్కి జరంత ఆలీసం అయ్యింది.అయ్యో! మన్వడు ఏం మొగమాట పడ్తుండో ఏమో అన్కుంట బోయిన. గప్పుడే శెయ్యి గడుక్కోడానికి ఎళ్తుంటె "అయ్యో! మన్వడా! ఏమన్కోకు. మంచిగ దిన్నవు గద! అని రంధి జేత్తుంటే .." "మా అమ్మమ్మ లెక్కనే నువ్వు సుత. మంచిగనే తిన్న అమ్మమ్మా!" అన్కుంట ముందుగదిల కెల్లి ఆరాం కుర్సీల కూసుండు.
ఇంతట్లనే నాగ్గూడ పెట్టు తింటని ఆయ్నొచ్చిండు. ఇంగ గాడు తిన్న కంచం దీసి జాలట్లేసి,ఈనెకి పెడ్దమని అన్నం సర్వ దీస్తే ఇంగేముంది.అడ్గంటిన మెతుకులు దప్ప. గట్లనే పులుసు గిన్నె,మూకుడు జూత్తె మొత్తం ఖతమైనయ్. గిన్నెల పులుసు,మూకుట్ల అడుగు బొడుగు కారం మిగిలిందంతే అవ్వా!"... గా మాటల్కి అమ్మలక్కలంతా వామ్మో! నీ మన్వడు భీముడా? బకాసురుడా? మీ అక్కెట్ల బరిత్తుందో అని నవ్వబట్టిండ్రు.
గప్పుడు అవ్వ సుత నవ్వుకుంట"అర్థశేరు బియ్యం తింటావురా అంటే-అంతా తిన మూడు మెతుకులు విడిచి పెడ్తానన్నాడట" ఎన్కటి కొకడు.గట్లనే ఉందిగద గీ కత " అంటుంటే ...
అమ్మలక్కలంతా పొట్టబట్టుకొని ఒక్క తీర్గ నవ్వుకుంట "గింతకీ మా బావనేం జేసినవక్కా.మళ్ల శేపల శెర్వుకు ఉరికిండా! ఆకల్తో కడ్పు మండి నిన్ను బగ్గ తిట్టిండా?... అంటుంటే మళ్లో గిద్దెడు బియ్యం బొగ్గులపొయ్యి మీదేసి వొండి పెట్టిన.ఆడు అటెళ్ళిండు.గీ ముచ్చట చెప్పేదన్క కడుపుబ్బరం ఆగలేదు. అంద్కే గిట్ల మీ తానకొచ్చినని చెప్పుకొచ్చింది.
గిదండీ సంగతి! "అర్థశేరు బియ్యం తింటావురా అంటే-అంతా తిన మూడు మెతుకులు విడిచి పెడ్తానన్నాడట" అంటే గిదే మరి గిట్ల కొంత మందిరి తిండిపుష్టి చూస్తుంటే "వామ్మో అనిపించక మానదు. మరి మన బంధువుల్లో ఇట్లాంటి వాళ్ళనోసారి యాదికి తెచ్చుకోండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి