ఈ లోకంలో.....:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చిరునవ్వులు చిందిస్తున్న
చిద్విలాసులు ఎందరో
వెలుగులు వెదజల్లుతున్న
వికాసవదనులు ఎందరో     ||చిరు||

తేనెపలుకులు చల్లుతున్న
తెలివైనవారు ఎందరో
అమృతజల్లులు కురిపిస్తున్న
అనుభవఙ్ఞులు ఎందరో

అందాలు చూపుతున్న
అపురూపులు ఎందరో
ఆనందాలు పంచుతున్న
అత్మీయులు ఎందరో           ||చిరు||

సుగుణాలు నేర్పుతున్న
సద్గురువులు ఎందరో
సత్కర్మలు చేయిస్తున్న
సుశీలులు ఎందరో

సద్బాటను నడిపిస్తున్న
సౌమ్యులు ఎందరో
సమస్యలు తొలగిస్తున్న
శుభకరులు ఎందరో         ||చిరు||

సలహాలు అందిస్తున్న
స్నేహితులు ఎందరో
సత్కారాలు చేస్తున్న
సుజనులు ఎందరో            

మెప్పులు గుప్పిస్తున్న
మేధావులు ఎందరో  
గొప్పలు వ్యాపిస్తున్న
ఘనులు ఎందరో          ||చిరు|| 

వందనాలు వందనాలు
పెద్దలకు వందనాలు
దీవెనలు దీవెనలు
చిన్నవారికి దీవెనలు

ధన్యవాదాలు ధన్యవాదాలు
ప్రోత్సాహకులకు ధన్యవాదాలు
ప్రణామాలు ప్రణామాలు
ప్రముఖపండితులకు ప్రణామాలు  ||చిరు||


కామెంట్‌లు