అంతర్జాతీయ గుర్తింపు రామంచ విద్యార్థులకు

 ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక నవంబర్ 30న ఆన్లైన్లో 13 గంటల పాటు అంతర్జాతీయ బాలల రచయితల సమ్మేళనం బాల సాహిత్య భేరి 2025 ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనుటకు సిద్దిపేట జిల్లా రామంచ పాఠశాల నుండి బి. సంజన పదవ తరగతి, బి బ్లేస్సి తొమ్మిదవ తరగతి బాల రచయితలుగా ఎంపికయ్యారు. కథ కవిత్వం ,గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 101 మంది బాలబాలికలు పాల్గొంటుండగా,బ్లెస్సి, సంజన పద్య విభాగంలో తమ పద్యాలను మూడు నిమిషాల్లో వినిపిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రఖ్యాత బాలసాహితీవేత్తలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులు అరుదైన అవకాశం కల్పించినందుకు తాన అధ్యక్షులు డాక్టర్ నరేన్ కోడాలి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్, సమన్వయకర్త చిగురుమల్ల శ్రీనివాస్ కు పాఠశాల  ప్రధానోపాధ్యాయులు సత్తవ ,ఉపాధ్యాయులు భాస్కర్ ,మల్లయ్య, నరేందర్ ,భవాని,సాయి జమున ధన్యవాదాలు తెలుపుతూ...ప్రోత్సాహించిన ఉపాధ్యాయురాలు జె.నిర్మలకు,అభినందనలు,విద్యార్థులకుఅభినందనాశీర్వాలు తెలియజేశారు
కామెంట్‌లు