మనదేశపు తాటాకు కొయ్యబొమ్మలు గుడ్డతో తయారైన బొమ్మలు మాయం.లక్కపిడతలు గుజ్జనగూళ్లు కాగితపుగుజ్జుబొమ్మలు మర్చిపోయాం.ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ అలరించేది అమెరికన్ బార్బీ రాబర్ట్స్ అంటే జనాలకి మోజు. ఆస్ట్రేలియన్ యువకుడు బ్లెన్ తో సావాసం తో బార్బీ మాజీప్రియుడు కెన్ బ్యార్ బ్యార్ అంటూ భోరుమన్నాడు. 43ఏళ్ల వారిబంధం పుటుక్కున తెగటంని న్యూస్ ఛానెల్స్ చూపాయి ప్రపంచమంతా వీక్షించింది.ఇంతకీ ఆబార్బీ అందాల బొమ్మ పిల్లల కిష్టమైన ముద్దుగుమ్మ సుమండీ. 1959 లో అమెరికన్ మహిళ తన కూతురికోసం ఓటీనేజ్ బార్బీ బొమ్మను తయారుచేసింది.3లక్షల51వేల బొమ్మలు టకటకా అమ్ముడైనాయంటే నమ్మబుద్ధికాదు గదూ?అప్పుడు దాని వెల 3డాలర్లు.దానికి జోడుగా కెన్ అనే మగబొమ్మని తయారుచేసింది.అమ్మకాలు జోరున సాగాయి.1961లో 45దేశాల్లో బార్లి రకరకాల ఆకారాలు అలంకరణ తో హాట్ కేక్ లా అమ్ముడైంది. 600రూపాల్లో రాక్ స్టార్,అంతరిక్ష యాత్రికురాలిగా, బార్బీ గుండెల్ని దోచుకుంది. 250దేశాల్లో పిల్లల స్వప్నసుందరి ప్రతి సెకండ్ కి 2బార్బీలు అమ్ముడవుతున్నాయి.ఒరిజనల్ తొలి బార్బీ 10వేల డాలర్ల కి
అమ్ముడుపోయింది. 1990లో ఫ్రెండ్ షిప్ బార్బీ బెర్లిన్ గోడ కూల్చినపుడు మార్కెట్ ని కొల్లగొట్టింది. అమెరికన్ సంస్కృతికి అనుగుణంగా బార్బీలో ఇంకెన్ని మార్పులు చేర్పులొస్తాయో!?🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి