కాలసముద్రాన్ని మించి గాఢాంధకారాన్ని
మింగిన స్వప్నం
జన సముద్రాన్ని కన్నా మాతృమూర్తి
కన్నీటిలో కరిగిన సమస్త శిలలు
మృత్యు నృత్యంలో మునిగితేలుతున్నాయి.!!
జనన మరణాల గొంతులో
కాలసర్పాలు బుస కొడుతుంటే
సంగీతం గీతం సప్త సముద్రాలు దాటి
కొట్టుకుపోతున్నాయి.!!
అంగ అంగాలు అల లో నిద్దురలో
మొద్దు బారిన శబ్దం కళ్ళ ముందు
గజ్జెలు తొడిగి తాండవం చేస్తుంటే
దద్దరిల్లిన వళ్ళు ఉప్పొంగితే మైకం సుడిగుండాలు
అగ్నిగుండంలా మండుతున్నవీ!!
సముద్ర యజ్ఞంలో సమర్పించిన నీలాలు
నిండు గర్భిణిలా కదులుతున్నవి.
ఎత్తు పల్లాలు సమాప్తం సమాంతరం
అంతరంగం ఇప్పుడు.
రంగస్థలం ముందు ఆ పాత్ర సముద్రుని రుద్రరూపం సాక్షాత్కారం.!!?
కిందికి దించిన చంద్రుని చులకన చేయక
చెక్కిళ్లపై నల్లని నక్షత్రాన్ని దించి
సముద్ర గర్భం నిర్భయంగా ప్రసవించింది.
వెండి వెన్నెల వెలుగుల్లో కళ్ళు అలిగి ఒరిగిపోయినవీ!!
మెల్ల మెల్లగా వేదిక దిగిన విధి
వీధి దీపాల వెంట పాదాలు మోపినై
రాలిన నక్షత్రాల్ని దాచిన దావానలంలా సముద్ర ఉగ్రరూపం ముందు
ముత్యం ఒకటి మెరిసింది రత్నం ఒకటి దొరికింది.!!?
చీకటి తొలిగేదాకా
అమ్మ సముద్రం అయింది అనంత ఆకాశమైంది!!
బిట్స్ పిలాని విద్యార్థి జడ్చర్ల సాయి మణిదీప్ స్మృతిలో.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి