ప్రేమబంధీ:- దోసపాటి వేంకట రామచంద్ర రావు - విజయనగరం

 సాహితీ కెరటాలు
============
 ప్రేమ రెండక్షరాల సూత్రం.
ప్రేమ బంధంలో ఒక్కసారి చిక్కుకుంటే చాలు.
ప్రేమ ప్రేమనే ప్రేమిస్తుంది.
చూపులు కలుస్తాయి.
మాటలు పెరుగుతాయి.
క్షణ క్షణానికి ఒకరినొకరు వదులు కోలేని స్తితి.
నువ్వు లేక నేనులేనన్న గతి.
ప్రేమసాగరంలో మునిగితేలుతారు.
పెనవేసుకున్న హృదయలయలను వింటారు.
ఎదలో కదిలే కదలికలను కనుగొంటారు.
ఒకరికోసం ఒకరం పుట్టామనుకుంటారు.
కలిసి జీవించాలని కంకణం కట్టుకుంటారు.
వెచ్చని స్పర్శకోసం తపిస్తారు.
ఎదురు తిరుగుతామనుకుంటారు.
ఎందురొచ్చిన వాళ్ళను ఎదుర్కొంటారు.
అహంకారపు హుంకారాలకు ప్రేమఖైదీలవుతారు.
శృంకలాలలకు కట్టబడి కొట్టబడతారు.
చరిత్రలో ప్రేమ కథలను తలచుకొంటారు.వారిల
 వారి లాగే మనము ఒకళమని భావిస్తారు.
 ప్రేమచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

కామెంట్‌లు