గద్వాల సోమన్నకు పెందోట సాహితీ పురస్కారం

 నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె  జడ్పీ హైస్కూల్లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ సాహిత్యవేత్త, బాలబంధు శ్రీ గద్వాల సోమన్నను పెందోట సాహితీ పురస్కారం వరించింది.శ్రీవాణి సాహిత్య పరిషత్  సంస్థ, సిద్దిపేట, తెలంగాణ వారు నిర్వహించిన బాలసాహిత్య సంపుటాల పోటీలలో సోమన్న విరచిత "తారాజువ్వలు" పుస్తకం బాలసాహితీ పురస్కారానికి ఎంపికైంది. ఇందుకు గాను గద్వాల సోమన్నను నగదు తో పాటు సత్కరించారు.అనంతరం వీరు వ్రాసిన పుస్తకం "అక్షర నక్షత్రాలు"డా. నలవోలు నరసింహారెడ్డి, డా. గోపాల్ సందర్శనం,బాలసాహిత్యవేత్త గరిమెళ్ల అశోక్, డా. వరకోలు లక్ష్మయ్య,డా.వాసరవేణి, బాలసాహిత్యవేత్త పెందోట వెంకటేశ్వర్లు, ఎ. యస్. ఐ తొగర్ల సురేష్ మొదలగు వారి చేతుల మీద పుస్తకావిష్కరణ చేశారు.వీరు అనతి కాల వ్యవధిలో 84 పుస్తకాలు వ్రాసి ముద్రించడం విశేషం, గమనార్హం.అవార్డు ఈ కార్యక్రమంలో  కవులు, కళాకారులూ రాజమౌళి, రామయ్య, పొర్ల వేణుగోపాల్ రావు, ప్రముఖ కార్టునిస్ట్ వడ్డేపల్లి వెంకటేష్,చింతల శ్రీనివాస గుప్తా తదితరులు పాల్గొన్నారు.గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు మరియు విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు