డొక్కాడదు
కడుపునిండదు
నిదురపట్టదు
గాలాడితేగాని
శ్వాసందదు
గుండెకొట్టుకోదు
ప్రాణంనిలువదు
అనుభవిస్తేగాని
అవగతంకాదు
విశ్వాసంకలగదు
ఆనందందొరకదు
కళ్ళతోచూస్తేగాని
నిజాలుతెలియవు
నమ్మబుద్ధిపుట్టదు
రంగుబయటపడదు
సాధనచేస్తేగాని
పనులుసమకూరవు
ఫలితాలుచిక్కవు
ప్రతిభవెల్లడికాదు
మనసువిప్పితేగాని
నిజాలుతెలియవు
అంతరంగంవెలువడదు
విలువబహిర్గతంకాదు
అడుగులేస్తేగాని
ముందుకుజరగము
పయనంసాగదు
గమ్యముచేరము
కలంకదిలితేగాని
కాగితంమాట్లాడదు
కవితాపుష్పంపూయదు
భావరాగంవెలుగొందదు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి