సాహితీ కెరటాలుసాహితీ కవి కళా పీఠం===================అందమైన నీ రూపాన్ని,నా కనులలో బంధించా చెలీ!నా చూపు చెరసాలలో,నువ్వో ప్రేమ ఖైదీ!సమ్మోహనమైన నీ నవ్వుని,నా వీనులలో దాచుకున్నా సఖీ!నా వినికిడి కారాగారంలో,నువ్వో ప్రేమ ఖైదీ!మధురమైన నీ పలుకులని,నా హృదిలో నిలిపివేశా ప్రియా!నా భావాల జైలు గోడల్లో,నువ్వో ప్రేమ ఖైదీ!నీపై అమితమైన అనురాగాన్ని,పెంచుకున్న నీ చెలికాడిని నేనే!చేరి అలరించవే భామినీ,నేనౌతా నీ కౌగిలిలో జీవిత ఖైదీ!ఈ వలపు బంధనాలు,ఈ ప్రణయ బంధాలు,బంధించే సంకెళ్లు కావులే మోహినీ!ఇవి స్వర్గలోక ప్రవేశమేలే!
జీవిత ఖైదీ:- :బి.ఉషారాణి-మంచిర్యాల
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి