అందం…అన్న సొంతం..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
చిత్రం...
భళారే విచిత్రం...
అయ్యారే విచిత్రం...
అన్న నందమూరి ముఖచిత్రం..
తిలకించేందుకు చాలవు చాలవు..
రెండు కళ్ళు కావాలిఒళ్ళంతా కోటికళ్ళు..!

ప్రపంచంలో...
చేయి తిరిగిన ఏ చిత్రకారుడూ
గీయలేని ఆ దివ్య రూపం...
అన్న నందమూరి ముఖచిత్రం..!

సప్తవర్ణాల హరివిల్లులో
ప్రతిఫలించే సౌందర్య సౌరభం...
విశ్వాన్నే విస్మయ పరిచే
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 
నందమూరి తారకరామారావు రూపం..!

కళ్లను మిరుమిట్లు గొలిపే
అమరశిల్పి జక్కన్న చెక్కిన
అందమైన అపురూప శిల్పమే..స
అన్న..నందమూరి దైవకళల ప్రతిరూపం..!

తిలకించగానే మది పులకించే...
చూసిన క్షణమే చిత్తం మత్తెక్కే...
ప్రకృతిలోన దాగిన అందాలన్నీ
ఏక రూపంలో కలిసిన కళాత్మకం...
అన్న...నందమూరి సుందర రూపం..!

వెన్నెల వెలుగు కన్నా...
వేకువ వెలుగుల శోభ కన్నా...
ఇంద్రధనుస్సు రంగుల కన్నా...
మయూరి పాదనాట్యం కన్నా...
పున్నమి చంద్రుని ఛాయ కన్నా...
ముద్దొచ్చే చిరునవ్వు కన్నా...మిన్నైన
అందం...అన్న నందమూరి సొంతం..!

ఇంద్రలోకపు సుందరీమణులే
అసూయతో ఆశ్చర్యచకితులయ్యే...
దివ్యకాంతి పుంజంలా మెరిసిపోయే...
అపురూపమైన ఆ దైవ‌ స్వరూపమే...
అన్న...నందమూరి సుందర రూపం..!

మకుటంలేని మహారాజులా
తెలుగు చలనచిత్ర జగత్తును
ఏలింది అన్న పరమాత్మ ప్రతిరూపమే..!

శ్రీకృష్ణుడు...శ్రీరాముడు...
శివుడు...భీముడు...భీష్ముడు...
కర్ణుడు...అర్జునుడు...దుర్యోధనుడు...
విశ్వామిత్రుడు... మైరావణుని...వంటి
పురాణ పురుషుల పాత్రలకు ప్రాణప్రతిష్ట
చేసింది అన్న నందమూరి సుందరరూపమే.!

వెండితెర వేల్పుగా...
సినీ చరిత్రలో చిరస్థాయిగా...
మన గుండెగుడిలోనిత్యం వెలిగే దీపం...
మన అందాల నందమూరి సుందర రూపం.!

ఆ రూపం...
అపురూపం...ఆ సౌందర్యం...
మానవాతీత కాంతిమయం...
బ్రహ్మ...విష్ణు...మహేశ్వరుల వరం...
అన్న...నందమూరి సుందర రూపం...!

సృష్టిలో ప్రతిజీవిలో పరమాత్మ ఉన్నట్లే...
అన్న ఎన్టీఆర్ నిండైన విగ్రహంలో నిక్షిప్తం
దేవుళ్ళ పురాణపురుషుల ప్రతిరూపాలు.!

తెలుగు గడ్డపై తెలుగు బిడ్డగా
జన్మించి, తెలుగు జాతి గౌరవాన్ని
విశ్వానికి వినిపించిన ఆ జాతిరత్నాన్ని
కన్న...ఈ తెలుగుతల్లి చేసుకున్న...
ఏ జన్మ పుణ్యఫలమో కదా ..!




కామెంట్‌లు