వెన్నుముక లేని కర్షకుడు:- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్
సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు
=============
ఆరుగాలం కష్టపడే కర్షకునకు ఓ సామ్రాజ్యమిస్తే! 
వినడానికి వినసొంపుగా ఉన్నప్పటికీ ...
అక్కర లేదంటాడు అన్నదాత. 
మీరు కడుపునిండా తిని నా కడుపు నింపండి అంటాడు.
అంతటి ఉదాత్తుడు మన అన్నదాత. 
ఉసురులను నిలబెట్టడానికి తన ఉసురునే ఫణంగా పెట్టే అవదాత.
అతనే బలహీనమైన వెన్నుముకతో దేశానికున్న వెన్నుముక.
జై కిసాన్ కీర్తనల కన్నా జోహారులు ఎక్కువైన ప్రాణదాత.
వ్యవసాయానికి ప్రాధాన్యత గల దేశంలో కర్షకుల ...
పంటలకు మద్దతు ధరలు నిర్ణయించేది ప్రభుత్వం.
కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వాన్ని యాచించే కర్షకుడు ...
సామ్రాజ్య నేత కాలేకపోయినా ఆ నేతను నిర్ణయించగలడు.
నేతలను నిర్ణయించే శక్తి నేతలనూ చేయగలదని శక్తి కర్షకులకు తెలిస్తే... 
కర్షకులంతా ఏకతాటిపై నిలబడి రాజ్యాధినేతలు కావచ్చు. 
సామ్రాజ్యాలకు అధిపతులవ్వచ్చు.
ప్రజాస్వామ్య దేశంలో తీరని అవకాశమది. 
ఓటుకి నోటు తీసుకొనే సమాజంలో నేతనవ్వాలనే కోరిక ...  
వెన్నుముక లేని కర్షకులకు సాధ్యమయ్యే పనా!
•••••••••••••~•


 

కామెంట్‌లు