సైకిల్ స్వామి:- - యామిజాల జగదీశ్
 ఆయన పేరు సాధు రామస్వామి పిళ్లై. భగవాన్ రమణమహర్షి భక్తుడు.  రమణులవారిని ఆశ్రయించి, ఆయనకూ, తోటి భక్తులకు సేవ చేస్తూ స్వీయ సమర్పణతో కర్మ యోగాన్ని అభ్యసించిన భక్తులలో రామస్వామి పిళ్ళై ఒకరు. ఈయనను అందరూ "సైకిల్ స్వామి" అని ఆప్యాయంగా పిలిచేవారు. 
కొందరు భక్తుల సహాయసహకారాలతో ఈ సైకిల్ స్వామి కొండమీది స్కందాశ్రమానికి వెళ్ళే మార్గాన్ని సుగమం చేసారు. 
ఆశ్రమ విధులను, భక్తుల అవసరాలను తీర్చడానికి ఆయన రోజులో అనేకసార్లు తన సైకిల్‌పై భగవాన్ రమణ మహర్షి వద్దకు వచ్చి వెళ్తుండే వారు. 
అందువల్ల, ఆయన భక్తులు ఆయనను ప్రేమగా "సైకిల్ స్వామి" అని పిలుస్తుండే వారు. 
ఆయన శ్రీ రమణాశ్రమంలో నందవనం, తోట మొదలైన వాటిని ఏర్పాటు చేశారు. ఆశ్రమ పరిసర ప్రాంతాలలోను నీడనిచ్చే అనేక చెట్లను నాటారు. వాటిని సంరక్షించారు. 
అక్షరాలా వందేళ్ళు జీవించి తనువు చాలించిన రమణ భక్తుడాయన.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ.


కామెంట్‌లు