సుప్రభాత కవిత : - బృంద
ప్రభవించువేళ  ప్రసరించు 
కిరణాలు 
పచ్చని నేలపై  వెచ్చగా 
లిఖించు ప్రేమలేఖలు..

వాకిటిలో ఎదురుచూచు 
ప్రియురాలికి 
వచ్చేకబురు అందించు
ఆత్రాలు

హిమబిందువుల మాటున 
దాగిన చెలిమోమును 
కనులారా చూడాలని వెచ్చగ
తాకిన మోహాలు.

మబ్బులన్ని తేలి తేలి 
మరిమరి కిందికి వచ్చి 
ముచ్చటగా తొంగి చూచె
మురిపాల సరాగాలు

లేత ఎండకు మెరిసిపోతూ 
తరలివచ్చు తరణి ని చూసి
పోరలుతున్న మమకారంతో
చేతులు చాపే పంటపొలాలు

ఎదిగి వచ్చు బింబము తాను 
ఎదురుచూచు జగతికి తెచ్చే 
ఎనలేని ఆనందపు సిరులు
ఎవరెవరికెంత ప్రాప్తమో!

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు