సోముకు గొప్పలు చెప్పుకోవడం అలవాటు. సోము చదువులో అంతంత మాత్రమే. కానీ కోతలరాయుడు. ఒకరోజు రాజు తన పుట్టినరోజు సందర్భంగా తన మిత్రులను తన ఇంటికి పార్టీకి ఆహ్వానించాడు. పుట్టినరోజు వేడుకలు ముగిసాయి. సోము వాళ్ల అమ్మ విమల సోము స్నేహితులతో చదువు విలువ గురించి సవివరంగా చెప్పి, "మీరు చదువులో ఏ స్థాయిలో ఉన్నారో నిజాయితీగా చెప్పండి. అని అడిగింది. కొంతమంది ఉన్నది ఉన్నట్లౌ చెప్పుకున్నారు. కొంతమంది తమ గురించి తాము అతిశయోక్తులు చెప్పుకున్నారు.
అందరి కంటే ఎక్కువ సోము కోతలు కోసుకున్నాడు. తాను అన్ని సబ్జెక్టులలో చాలా తెలివైన వాడినని, గణితంలో ఎప్పుడూ వందకు వంద మార్కులు వస్తాయని విమలమ్మ ముందు కోతలు కోశాడు. ఆ సమయంలో చుట్టుపక్కల తన క్లాస్ మేట్స్ ఎవరూ లేరు. "శభాష్ సోమూ! నా చిన్న కొడుకు మోహన్ 7వ తరగతి చదువుతున్నాడు. వాడు లెక్కలలో చాలా వీక్. రోజూ తీరిక సమయంలో మా ఇంటికి వచ్చి, వాడికి లెక్కలు చెప్పాలి. రోజూ నీకు ఇష్టమైన ఫుడ్స్ చేసి తినిపిస్తా. ఈ ఒక్క సహాయం చేయవా ప్లీజ్! నా చిన్న బంగారం." అన్నది విమల. 'బాబోయ్! అనవసరంగా కోతలు కోసి ఇరుక్కున్నాను. ఇప్పుడు దారి ఏమిటి బాబోయ్!' అంటూ "ఇంటివద్ద అర్జెంట్ పని ఉన్నది. తర్వాత కలుస్తా అండీ!" అంటూ అక్కడ నుంచి జారుకున్నాడు సోము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి