అడుగు అడుగుకు
పరచుకునే వెలుగులో
అణువణువునా
తొలగిపోయే చీకటి
వెలుగుల నీడలో
వేకువ పయనంలో
వెలుగును బ్రతుకే
కలుగును జయమే!
తెలియని దారుల
ఎరుగని మలుపులు
గెలుపుల వెంటే
ఉరుకుల పరుగులు
గతం తలచే తీరిక
నిలిచి చూసే ఓపిక
వెనక బడే కోరిక లేక
ఒకటే వేగం ఆగక!
పొందినదేమిటో
పోగొట్టుకొన్నదేమిటో
రెక్కలు అలిసాకే
లెక్కలు వేసే నైజం!
బంగరు కాంతుల
ఊగే గరిక పువ్వుకు
కంగారుండదు రేపటిపై
సింగారాలన్నీ నేడే!
తృప్తిని మించిన
సంపద కలదా?
సంతోషాన్ని మించిన
సౌభాగ్యం వుంటుందా?
మించిన రేయిని
ముంచే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి