ఎందుకు చదవాలి!!?-డా ప్రతాప్ కౌటిళ్యా.
 మనిషి సగటు జీవితకాలం దాదాపుగా ఏబది ఏళ్లు మాత్రమే. అంటే మనిషి బ్రతికేది కేవలం 50 ఏళ్లు అంటే మన జీవితకాలంలో సగటున దాదాపు మూడు దశాబ్దాలు చదివుకే సరిపోతే. ఉద్యోగం చేసేది కేవలం రెండు దశాబ్దాలు మాత్రమే. ఇలాంటి వాస్తవంలో మనం జీర్ణించుకోలేని అంశం ఏదైనా ఉందంటే అది చదువు. అంటే అసలు చదువు ఎందుకు చదవాలి. పెద్దలు చెప్పినట్లు చదువు జ్ఞానం కోసం చదవాలి. నిజం చెప్పాలంటే జ్ఞానం ఒక్కటే కాదు ఉద్యోగం కోసం చదవాలి. ఇక్కడితో ఆగక ఫ్యాషన్ కోసం మాత్రమే చదువుకోవాలన్నది మన సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. కనుక మన జీవితంలో చదువు చాలా ముఖ్యమైనది. అందుకే చదువు ఇప్పుడు ఒక గొప్ప వ్యాపార వస్తువు. చదువు చెప్పే వ్యాపార సంస్థలు కోట్లు కోట్లు సంపాదించి చదువును ఎందుకు చదివాలో పైన చెప్పిన మూడు అంశాల కోసం మాత్రమే చదువు చదవాలని చెప్తున్నారు. అదొక పెద్ద వ్యాపార కుట్ర చదువు ఒక ప్రమాదకర వస్తువుగా మారింది. 
వాళ్లు చెప్పినట్లే చదువు జ్ఞానం కోసం మాత్రమే అయితే ఫ్యాషన్ కోసం మాత్రమే అయితే వాళ్లు మాత్రమే చదువును చదువుకోవాలి. కానీ కేవలం ఉద్యోగం కోసం మాత్రమే చదివే వాళ్ళు మాత్రం అంత శ్రమించి జీవితకాలమంతా త్యాగం చేసి సంపదను అంతా ఖర్చు చేసి న ఉద్యోగం వస్తుందా డబ్బు సంపాదిస్తామా అనే గ్యారెంటీ లేదు మరీ గ్యారెంటీ లేని ఉద్యోగం కోసం ఎందుకు చదవాలి. సంపదను సృష్టించని చదువు కన్నా సంపదను సంపాదించి పెట్టే పనిని నేర్చుకోవడం ముఖ్యం. అంటే వృత్తి విద్య లేదా నైపుణ్యాలు ఇచ్చే చదువు చదువుకుంటే సరిపోతుంది. దానికి కావాల్సింది కేవలం బేసిక్స్ ఫండమెంటల్స్ మాత్రమే అయితే సరిపోతుంది.
: బేసిక్ ఫండమెంటల్ విద్యకు 20 30 సంవత్సరాలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ముందు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు గమనించాల్సిందేమిటంటే మనం ఫ్యాషన్ కోసం చదువుతున్నామా లేక జ్ఞానం కోసం చదువుతున్నామా ముందు తేల్చుకోవాలి. ఆ తర్వాత ఉద్యోగం కోసం డబ్బు సంపాదన కోసం మాత్రమే చదువును చదువుతున్నామనుకుంటే మిమ్మల్ని చాలా ప్రమాదకరమైన విద్యా వ్యాపారం మోసగించి జీవిత కాలాన్ని పీల్చి పిప్పి చేసి చదువుకున్న వాళ్లని సమాజంలో ఎటు కాకుండా చేస్తున్నాయి. జీవితాన్ని డబ్బును శ్రమను వయసును కోల్పోతాం జాగ్రత్తగా ఆలోచించుకోండి. బేసిక్స్ ఫండమెంటల్స్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచానికి కావాల్సిన చదువు- సామాన్యునికి కావాల్సిన చదువు. దీనికి ఒక జీవితకాలం దార పోయాల్సిన అవసరం కానీ శ్రమను డబ్బును వృధా చేయాల్సిన అవసరం లేదు. మనకు అవసరమైనది ప్రపంచానికిక కావలసినది మనం నేర్చుకుంటే సరిపోతుంది. 
డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు