కుంతీదేవి!- అచ్యుతుని రాజ్యశ్రీ

 పాండవుల తల్లి కుంతీమాత ఆదర్శ పత్ని తల్లి.కృష్ణుని మేనత్త,వసుదేవుని సోదరి,కుంతిభోజుని దత్తపుత్రిక, పాండురాజు భార్య. "కృష్ణా! నాకు కష్టాలంటేనే ఇష్టం.అప్పుడే నీవు సదా నాగుండెలో ఉంటావు" అన్న మహాభక్తురాలు. కుంతిభోజునింటికి ఓతపశ్శాలి వచ్చాడు.వేళకాని వేళ వచ్చి ఏదో ఒకటి అడిగేవాడు.విసుగు చిరాకు లేకుండ చిన్నారి కుంతి ఆయన్ని సేవించటంతో ఆయన ప్రసన్నుడై ఆమె ఏమీ కోరకుండానే, అధర్వపువేదంలోమంత్రాలు ఉపదేశించి "నీవు కోరిన దేవత వస్తాడు" అనిచెప్పి మాయమైనాడు. ఆయనే దుర్వాసమహర్షి.తన ముగ్గురు కొడుకులతో పాటు సవతిమాద్రి పిల్లలు నకుల సహదేవుల్ని పెంచింది.భర్త చనిపోయాక ఐదుగురు పిల్లలతో ఆమెపడిన కష్టాలు ఇంతింత అని చెప్పలేము.
కన్నెగా సూర్యానుగ్రహంతో కర్ణునికి తల్లియై నదిలో విడిచిపెట్టినవేదన చెప్పనలవికాదు.ఆమె పరోపకార బుద్ధి అమోఘం.బకాసురుడి బారినుంచి బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడటంకోసం భీమునిపంపింది. అలాగే ద్రౌపదిని తన ఐదుగురుకొడుకుల భార్య గా నిర్ణయించింది.పెద్ద కొడుకు ధర్మ రాజు సలహానితీసుకునేది.హస్తినాపురంలో ఆమె ఉంది పాండవుల అరణ్యవాసంచేసినపుడు. కురుక్షేత్ర యుద్ధంతర్వాత రాజమాతగా కుంతి హుందాగా ఉంది.బావతోడికోడలు ధృతరాష్ట్రగాంధారులకు తోడునీడగా ఉండి వారిసేవచేసిన  నిస్వార్థ పరురాలు. వారితో అడవికి బయలుదేరిన తల్లిని సూటిగా అడిగాడు భీముడు" అమ్మా! మేము కష్టపడి రాజ్యం పొందాక హాయిగా మాతో ఉండక, బావతోటికోడలితో అడవికి ఎందుకు వెల్తావు?" దానికి కుంతి జవాబు ఇది"నాయనా! క్షత్రియ ధర్మం మీరు పాటించాలి.అన్యాయాన్ని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో నేను పెంచాను. రాజ్యసుఖాలు నాకువద్దు" వనంకి వెళ్లి దావాగ్నిలో దేహత్యాగంచేసిన అపూర్వ త్యాగశీలి కుంతి🌷
కామెంట్‌లు